
వాయిస్ టుడే వరంగల్ జిల్లా బ్యూరో
.. కాంగ్రెస్ లో చేరిన తాజా మాజీ కార్పొరేటర్లు
..అదే బాటలో మరికొంత మంది అధికార ప్రతిపక్షాల నేతలు…
.. బిఆరెస్ బీజేపీ వ్యతిరేకతే కాంగ్రెస్ ను గెలిపిస్తుంది
___కాంగ్రెస్ మాజీ మంత్రి కొండా సురేఖ- మురళీధర్ రావు..
తెలంగాణాలో బిఆరెస్ బీజేపీ వ్యతిరేకతే రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వస్తుందని కాంగ్రెస్ మాజీ మంత్రి కొండా సురేఖ- మురలీధర్ రావు అన్నారు. శనివారం టిఫిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కొండా దంపతుల ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు అధికార పార్టీకి చెందిన చెందిన తాజా, మాజీ కార్పొరేటర్లు, పలువురు పార్టీ కీలక నేతలు కొండా దంపతుల నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం కొండా దంపతులు మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని బిఆరెస్ పార్టీనుంచి రాష్ట్ర నాయకుడు గోపాల నవీన్ రాజు, కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, మాజీ కార్పొరేటర్లు కేడల పద్మ, బత్తిని వసుంధర, తత్తరి లక్ష్మణ్, బాసాని శీను, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు బిల్ల పవన్, పిఏసిఎస్ చైర్మన్ కేడల జనార్దన్, జన్ను ప్రసన్న, బ్లాక్ నాయకుడు గోరంటల రాజు, 23వ డివిజన్ ప్రెసిడెంట్ కొక్కుల సతీష్, తోట వేణు తదితరులు మరో 30 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరడం శుభ సూచకం అన్నారు. వరంగల్ తూర్పులో అభివృద్ధి ఎం జరిగిందో ప్రజలందరూ చూస్తున్నారని కొండా దంపతులు చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసని అన్నారు. నిరుద్యోగం పెరిగి జీవనోపాధి లేక యువత ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అధికారం హంగు ఆర్భాటాలే తప్ప సామాన్య ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. వరంగల్ నగరం ఇప్పటినుండి చిన్న వర్షాలకే ముంపుకు గురవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు వరదల సమయంలో మాత్రమే హడావిడి చేయడం ఆ తర్వాత సమస్యను పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరోగ్యారెంటీలతో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జోరులో ఉందని అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలకు లొంగకుండా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎలాంటి ఆపద సమయంలోనైనా కొండా దంపతుల ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు, మాట్లడుతూ అనునిత్యం పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకులు కొండా దంపతులని కొండా సురేఖ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలియజేశారు….


