కొత్తగూడెం: కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు ను గెలిపించాలని కొత్తగూడెంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, అజీజ్ పాషా, సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గోన్నారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ బిఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే. బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో తీసుకొచ్చిన చట్టానికి బిఆర్ఎస్ ఓట్లు వేసి మద్దతు తెలిపింది. దేశంలో హిందూ ముస్లింలు ఉమ్మడి కుటుంబంలా కలిసి మెలిసి ఉండాలని, లౌకికవాదాన్ని నిలబెడుతున్నది కాంగ్రెస్ వామపక్షాలు మాత్రమేనని అన్నారు.
లౌకికవాదానికి తూట్లు పొడుస్తున్న బిజెపికి దానికి మద్దతు ఇస్తున్న బిఆర్ఎస్ కు మైనార్టీ సోదరులు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. కొత్తగూడెంలో జరుగుతున్న సభకు విచ్చేసిన జన సందోహాన్ని చూస్తుంటే సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయాన్ని ఎవరు ఆపలేరని స్పష్టంగా తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సాంబశివరావు గెలుపు కొత్తగూడెంకు చారీత్రాత్మకం కానుందని అన్నారు. మాజీ శాసనసభ్యుడిగా కూనంనేని సాంబశివరావు రాజకీయ నాయకుడి కంటే ప్రజలకు సేవకుడిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిపిఐ పార్టీలో ముందుండి పనిచేసిన నాయకులు సాంబశివరావు. నీళ్లు నిధులు నియామకాలు ఆత్మ గౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ప్రజలకు నీళ్లు రాలేదు, నియామకాలు రాలేదు, నిధులు మాత్రం కేసిఆర్ కుటుంబం పాలయ్యాయి.ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేస్తామని సిద్ధమయ్యారు. సింగరేణి ఉద్యోగాలకు గణీ కానీ, బిఆర్ఎస్ పాలనలో సింగరేణి కాలరీస్ సంస్థ దయనీయంగా మారింది. ఆదాయానికి నిలయమైన సింగరేణి బొగ్గు బావులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి బిఆర్ఎస్ పాలకులు దోపిడీ చేస్తున్నారు. బొగ్గు బావులను ప్రైవేటీకరణ చేసి సంపదను వ్యాపారస్తులకు దారా దత్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థలో ప్రైవేటీకరణ పేరుతో 1.05 లక్షల ఉద్యోగాలను 55వేలకు కుదింపు.
సింగరేణి కాలరీస్ సంస్థను విల విల చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పిడికిలి బిగించి బంగాళాఖాతంలో పడేద్దామని పాదయాత్రలో నాకు కార్మికులు గళమెత్తి వినిపించారు. ధనిక రాష్ట్రం తొమ్మిది సంవత్సరాల బడ్జెట్, ఐదు లక్షల కోట్ల అప్పు పూర్తిగా ఖర్చు చేశారు. కానీ పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం సంపద సృష్టించలేదు ఒక ఆస్తిని నిర్మించలేదు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ చేయలేదు కానీ అప్పుల తెలంగాణ గా మార్చారు. రాష్ట్ర సంపద ప్రజలకు పంచాలని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలను తీసుకువచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాంమని అన్నారు.
రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఇప్పుడు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్యన జరుగుతున్న ఎన్నికల పోరాటం ఇది. ఈ ఎన్నికల్లో గెలవాల్సింది దొరలు కాదు. ప్రజలు మాత్రమే గెలవాలి. దళితున్ని సీఎం చేస్తామని ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ గాలి కబుర్లు చెప్పదు. ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని అన్నారు.