మండల స్థాయి టాలెంట్ టెస్ట్ లో కొత్తపల్లి ప్రథమ స్థానం.
Kothapally first position in mandal level talent test.
జమ్మికుంట
విద్యార్థుల్లో ప్రతిభ దాగి ఉంటుందని దాన్ని వెలికి తీయడమే ప్రధాన లక్ష్యమని ఇటువంటి టాలెంట్ టెస్టుల ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయవచ్చునని జమ్మికుంట మండల విద్యాధికారి శ్రీమతి హేమలత, తెలిపారు. జమ్మికుంట జిల్లా పరిషత్ (బాయ్స్)లో జరిగిన ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో విజయం సాధించిన విద్యార్థులకు వారు బహుమతులు ప్రధానం చేస్తూ మాట్లాడారు. ఈరోజు నిర్వహించిన టాలెంట్ టెస్టులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపల్లి విద్యార్థి బి అమర్నాథ్ ప్రథమ స్థానం ఎం. రాహుల్ (కొత్తపల్లి ) శివసాయి వర్షిత (కేజీబీవీ )అశ్లేష (బాయ్స్ )ద్వితీయ స్థానం, స్పందన (కోరపల్లి) సుప్రజ (కేజీబీవి) తృతీయ స్థానం పొందారు. పోటీల పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల (బాయ్స్) ప్రధానోపాధ్యాయులు సదానందం, ఫిజికల్ సైన్స్ టీచర్లు స్వామి, స్రవంతి,మరియు దేవదాస్, రమేష్, సంతోష్ కుమార్, హేమలత, సురేఖ, బాలమణి, భాస్కర్ రెడ్డి, కృష్ణమూర్తి, సతీష్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు…