కాంగ్రెస్ పార్టీలో చేరిన కేఆర్సిపురం పిఎసిఎస్ చైర్మన్ గోసుల రాజేష్
కోదాడ /నడిగూడెం: మే 8(వాయిస్ టుడే ప్రతినిధి.). సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం,
కాగిత రామచంద్రపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్, కేశవాపురం గ్రామానికి చెందిన గోసుల రాజేష్ మంగళవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సమక్షంలో సొంత గూడైనా కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ సభ్యులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి , కాంగ్రెస్ నాయకులు పుల్లయ్య ,ఉపేందర్ ,అర్జున్ రావు ,సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు… ఈ సందర్భంగా చైర్మన్ రాజేష్ మాట్లాడుతూ నల్లగొండ ఇండియా కూటమి పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి ,అధిక మెజార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తామని ఆయన అన్నారు.