Thursday, January 16, 2025

కృష్ణా, గోదావరి నేతల మిస్సింగ్

- Advertisement -

కృష్ణా, గోదావరి నేతల మిస్సింగ్

Krishna and Godavari leaders missing

విజయవాడ, జనవరి 8, (వాయిస్ టుడే)
అధికారం కోల్పోయాక ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వైసీపీని నడిపించే నాయకుడు లేడన్న చర్చ ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా నడుస్తోంది. ఆ జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా తయారు అయిందట. వైసీపీ అధికారం చేజారిపోగానే.. బాలారిష్టాలు మొదలయ్యాయి. ఆ జిల్లాల్లో పార్టీని నడిపించే నాయకులు కరువవుతున్నారు.ఒక్కో నాయకుడిని ఏదో ఒక కేసు వెంటాడుతోంది. తెరమరుగైన కేసులను కూటమి ప్రభుత్వం తిరగతోడుతుండడంతో కొందరు వైసీపీ నేతలకు అరెస్టు భయం పట్టుకుంది. ఇందులో ప్రధానంగా మూడు కేసులు వైసీపీ నేతలను ఉక్కబోతకు గురిచేస్తున్నాయి. చంద్రబాబు ఇంటిపై దాడి, మంగళగిరి, గన్నవరం టీడీపీ కార్యాలయాల్లో విధ్వంసం కేసులో పలువురు నేతలు నిందితులుగా ఉన్నారు.ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పలువురు నేతలు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అజ్ఞాత జీవితమే గడుపుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ నోటికి పని చెప్పిన మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. మాజీ మంత్రి కొడాలిపై నమోదైన రెండు కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసినా, ప్రభుత్వం ఇంకేదైనా కేసులో ఇరికించి లోపల వేస్తుందనే భయంతో కొడాలి నాని కనిపించకుండా తిరుగుతున్నారని లోకల్ టాక్.ఇక గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌లపై దాడి కేసులో వల్లభనేని వంశీకి అరెస్ట్ తప్పేలా లేదు. చాలా కాలంగా ముందస్తు బెయిల్‌పై ఉన్న వంశీ.. ఇప్పుడు బెయిల్ రద్దు కావడంతో అరెస్ట్ ఖాయమనే గాసిప్‌ కృష్ణా జిల్లాలో బిగ్ సౌండ్ చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో వంశీ ముఖ్య అనుచరులు రిమాండ్‌లో ఉన్నారు. దీంతో వైసీపీ ఓటమి పాలైనప్పటి నుంచి వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఒకటి రెండు సందర్భాల్లో మినహా ఆయన బయట కనిపించింది లేదు. దీంతో గన్నవరంలో ఆరునెలలుగా వైసీపీ జెండా ఎక్కడా కనరావడం లేదు. దీంతో క్యాడర్ అయోమయస్థితిలో పడిపోయింది.ఎన్నికల్లో ఓటమి తర్వాత కృష్ణా జిల్లాలో కీలకమైన అధ్యక్ష బాధ్యతల్ని పేర్ని నానికి అప్పగించింది వైసీపీ అధిష్టానం. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికి, పేర్ని నాని రేషన్ బియ్యం స్కాంలో ఇరుకున్నారు. కేసుల ఎఫెక్ట్‌తో స్పీడ్ తగ్గించేసి కామ్ అయిపోయారు పేర్ని నాని.గన్నవారానికి వల్లభనేని వంశీని, గుడివాడకు కొడాలి నానిని , మచిలీపట్నానికి పేర్ని నానిని ఇన్చార్జులుగా కొనసాగిస్తున్నట్లు జగన్ ప్రకటించినా కేసుల భయంతో ముగ్గురూ క్యాడర్‌కి అందుబాటులో లేకుండా పోయారు. పెడన, పెనమలూరు నియోజకవర్గాల్లో తిరిగి కొత్త వారికి ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. వారు కూడా కనిపించడం లేదని వైసీపీ కార్యకర్తలు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని వీడిన వల్లభనేని వంశీ, గుడివాడకు దూరమైన కొడాలి నాని ఇప్పటివరకు ఎక్కడున్నారో తెలియదు. ఎప్పుడొస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొందిఇక గుంటూరు జిల్లా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మరియమ్మ హత్యకేసులో అరెస్టైన నందిగం సురేశ్.. తన పాత కేసుల వివరాలను దాచిపెట్టారన్న కారణంతో ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టు కూడా తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది.ఇలా చెప్పుకుంటూ పోతే గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలు గడప దాటి అడుగు బయట పెట్టడం లేదట. పార్టీ పిలుపునిచ్చిన కార్య క్రమాలకు సైతం వారు దూరంగా ఉంటున్నారు. చివరకు పార్టీ ప్రతిష్టాత్మకంగా పిలుపునిచ్చిన రైతు సమస్యలతో పాటు విద్యుత్‌ చార్జీలకు పెంపుదలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లోనూ వారు కనిపించలేదు.ఇలానే కంటిన్యూ అయితే భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏంటి అని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారంట. రాజకీయాల్లో కేసులు, అరెస్టులు సర్వసాధారణం. కానీ క్యాడర్‌కు భరోసా కల్పించలేని స్థితిలో కీలక నేతలే ఇలా సైలెంట్‌గా ఉంటే భవిష్యత్తులో పార్టీ జండా మోసేదెవరు..? పార్టీ, కార్యక్రమాలకు వచ్చేది ఎవరు, పార్టీని నడిపించేది ఎవరని కార్యకర్తలు పెదవి విరుస్తున్నారని పార్టీ ఇన్నర్ టాక్. మరి చూడాలి ఈ సమస్యని వైసీపీ హైకమాండ్ ఎలా చక్కబెడుతుందో..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్