సిరిసిల్ల ప్రజలకు నేనేంటో తెలుసు
హైదరాబాద్ సెప్టెంబర్ 15: సిరిసిల్ల ప్రజలకు తెలుసు నేనేం చేసానో… వారిపై నాకు నమ్మకం ఉంది… అందుకే ప్రతిజ్ఞ చేసానని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కృతజ్ఞత ర్యాలీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క డిగ్రీ కాలేజీ కోసం సిరిసిల్ల వేములవాడ మధ్య గొడవ జరిగిందని అన్నారు. అరవై ఏండ్ల పాలనలో ఒక్క డిగ్రీ కాలేజ్ కోసం లొల్లి అయిందని మంత్రి తెలిపారు. ఈరోజు తెలంగాణలో సిరిసిల్లలో విద్యా వైద్యం విషయంలో అగ్రస్థానంలో వుందని గుర్తు చేశారు.
డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణా నెంబర్ వన్ గా ఉందన్నారు. ప్రతీ వందమంది డాక్టర్ లలో 43 మంది తెలంగాణాలో తయారు అవుతున్నారని తెలిపారు. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన కు అనే స్థితి నుంచి సర్కార్ దవాఖానలో మాత్రమే ప్రసవం అయ్యే స్థితికి వచ్చామని తెలిపారు.ఒక్క డాక్టర్ పోస్ట్ కోసం.అడుక్కునే స్థితి నుంచి జిల్లాకు 100 కి పైగా స్పెషలిస్ట్ డాక్టర్ లు అందుబాటులోకి వచ్చారని కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 2 కాలేజీలు మాత్రమే కట్టారని తెలిపారు. 9 ఏండ్ల తెలంగాణలో 28 మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ వెనకబాటుకు కారణమని అన్నారు. తిరిగి వారు అధికారం ఇవ్వమంటున్నారని తెలిపారు. సిరిసిల్లలో ఒక్క రూపాయి పంచను, ఒక్క చుక్క మద్యం పంపిణీ చేయను అని చెప్పాను కట్టుబడి వున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల ప్రజలకు తెలుసు నేనేం చేసానో… వారిపై నాకు నమ్మకం ఉంది… అందుకే ప్రతిజ్ఞ చేసానని కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి కొనసాగాలంటే తిరిగి కేసీఆర్ ని ఆశీర్వదించాలని కోరుతున్ననని తెలిపారు.