Sunday, September 8, 2024

ఉమ్మడి మహబూబ్ నగర్ నేతలతో కేటీఆర్ సమావేశం

- Advertisement -
KTR meeting with joint Mahbub Nagar leaders

హైదరాబాద్
కేంద్ర పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు.  ఈ సందర్భంగా రానున్న ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపైన చర్చించారు. రానున్న లోక్ సభ, ఎంఎల్సీ ఉపఎన్నికపైన చర్చించారు. ఇప్పటికే ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఎన్నిక పైన చేపట్టాల్సిన కార్యాచరణ పైన చర్చించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ స్థానంతో పాటు నాగర్ కర్నూల్ లోక్సభ స్థానంలో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పైన పార్టీ అధినేత కెసిఆర్ ఒక విస్తృతస్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్సీతో పాటు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పరిస్ధితులను కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తామని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఈ రెండు లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలు బలంగా ఉన్నాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్