కంచ గచ్చిబౌలి పౌ సుప్రీం తీర్పును స్వాగతించిన కేటీఆర్
హైదరాబాద్
KTR welcomes Supreme Court verdict in Kancha Gachibowli case
కంచ గచ్చిబౌలి పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను భారత రాష్ట్ర సమితి, హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతుందని కేటీఆర్ తెలిపారు. కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అయన స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కు వన్యప్రాణులను కాపాడాలంటూ ఆదేశాలు ఇవ్వడం గొప్ప విజయం అని కేటీఆర్ పేర్కొన్నారు. వన్యప్రాణుల పట్ల, పర్యావరణ పరిరక్షణకు పాటుపడే ప్రతి ఒక్కరికి దక్కిన విజయం ఇదని అన్నారు,.
సుప్రీంకోర్టు ఉత్తర్వులు హైదరాబాద్తో పాటు తెలంగాణ పర్యావరణ పరిరక్షణకు గొప్ప ఊతం. గొంతులేని మూగజీవాల కోసం, చెట్ల కోసం, పర్యావరణం కోసం అండగా నిలబడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ధన్యవాదాలు. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి అడవిని కాపాడి, హైదరాబాద్ భవిష్యత్తు కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికారిక కమిటీ ఇచ్చిన సిఫార్సులను కూడా భారత రాష్ట్ర సమితి స్వాగతిస్తున్నది. కంచ గచ్చిబౌలిని ప్రైవేట్ పార్టీకి తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహారంలో ఆర్థిక అవకతవకలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన కేంద్ర సాధికారిక కమిటీ మా పార్టీ వాదనను బలపరుస్తున్నది. కంచ గచ్చిబౌలి భూముల తాకట్టు విషయంలో పదివేల కోట్ల రూపాయల అవినీతికి రేవంత్ రెడ్డి పాల్పడ్డారని చేసిన ఆరోపణలను పునరుద్ఘాటించారు. ర్. అడవుల పట్ల, వన్యప్రాణుల పట్ల రేవంత్ రెడ్డి నెంబర్ వన్ విలన్గా మారాడని విమర్శించారు.