- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీలో గెలిచిన నేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు.
రంగంలోకి దిగిన కేటీఆర్.. గెలిచిన బీఆర్‌ఎస్ నేతలతో తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు.
వివరాల ప్రకారం.. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత, గెలిచిన అభ్యర్థులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, వివేకానందరెడ్డి, సహ పలువురు మాజీ మంత్రులు, ముఖ్యనాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా భవిష్యత్ కార్యాచరణపై నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ఓటమి, తదితర కీలక అంశాలపై కేటీఆర్ చర్చించనున్నారు.
- Advertisement -