- Advertisement -
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు
KukatPally MLA Madhavaram Krishna Rao's sensational comments
హైదరాబీఆద్
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యాలు చేసారు. కూకట్ పల్లి నియోజక వర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేసారని అన్నారు. మంత్రి చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేస్తామని నెల రోజులుగా అధికారులు చెబుతున్నారు. చెక్కుల కోసం కోసం ఎమ్మెల్యే ఇంటి చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నారు. కళ్యాణ లక్ష్మి షాది ముభరక్ చెక్కులు ఎమ్మెల్యే పంపిణీ చేసే ఆనవాయితీ వుంది. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం మంత్రి వస్తేనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని అంటున్నారు నెల రోజులుగా కలెక్టర్, ఆర్డిఓ , ఏంఆర్ఓలు, పలుమార్లు ఫోన్ చేసిన మంత్రి వస్తానే పంపిణీ అనే సమాధానం చెప్పాడం సరైన పద్ధతి కాదు. ఎమ్మెల్యే రావడం అధికారులకు ఇబ్బంది అయితే అధికరులే పంపిణీ చేయండి. కానీ కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు ఇబ్బంది పెట్టితే ఊరుకొం . రేపు ఉదయం 11 గంటల వరకు లబ్దిదారులకు పంపిణీ చేయకపోతే ఏంఆర్ఓ ఆఫీసు దగ్గర ధర్నా చేస్తామని అన్నారు.
- Advertisement -