- Advertisement -
కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే (అక్టోబర్ 31) : కుత్బుల్లాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ఈరోజు నర్సాపూర్ మండలం, చాకలిమెట్లలోని శ్రీ శంకర ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, తెలంగాణ లో ప్రజా వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వం అంతం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడ్డం రాజేందర్ రెడ్డి, ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జెకె శేఖర్ యాదవ్, ఏర్వ వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు గరిగే శేఖర్ ముదిరాజ్, డివిజన్ ఇంఛార్జ్ మోతె శ్రీనివాస్ యాదవ్, మహేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -



