లేడీస్ క్లబ్ మహిళలకు ఆటల పోటీలు
Ladies Club Games competitions for womenకమాన్ పూర్
సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ సి.ఎన్.సి.ఓ.ఎ క్లబ్ నందు మహిళలకు నిర్వహించిన ఆటల పోటీలను లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి అలివేణి సుధాకరరావు, శ్రీమతి విజయలక్ష్మి వెంకటేశ్వర్లు ప్రారంభించారు.వీటిలో భాగంగా మహిళలకు బాల్ ఇన్ ద సర్కిల్, బాంబింగ్ ద సిటీ, రోలింగ్ బాల్ మొదలగు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొనడం చాలా సంతోషమని,ఇలాంటి పోటీలను సింగరేణి సంస్థ గత కొద్ది సంవత్సరాలుగా నిర్వహిస్తుందని అన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన మహిళలకు స్థానిక రాణి రుద్రమ దేవి క్రీడా ప్రాంగణం నందు ఈనెల 23న సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న సింగరేణి దినోత్సవ వేడుకల్లో బహుమతులు అందజేయబడునని తెలియజేశారు. సింగరేణి దినోత్సవ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి హరిణి, లేడీస్ క్లబ్ కమిటి సభ్యులు కోమలి, ప్రసన్న, లావణ్య, సేవా కోఆర్డినేటర్ సుధాకర్, నిర్వాహకులు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.




