- Advertisement -
మళ్లీ లేడీ అఘోరి హల్ చల్
Lady Aghori hal chal again
మెదక్, జనవరి 28, (వాయిస్ టుడే)
లేడీ అఘోరీ అంటేనే పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా వేదికగా ఈమెపై సాగిన ప్రచారాలు కూడా అన్నీ ఇన్నీ కావు. ముత్యాలమ్మ ఆలయంపై దాడి సమయంలో వెలుగులోకి వచ్చిన లేడీ అఘోరీ, సనాతనధర్మ పరిరక్షణ తన భాద్యత అంటూ ప్రకటించారు ఆ సమయంలో. అలా తెలంగాణలో అడుగుపెట్టిన కొద్దిరోజులకే పలు ఛానల్స్ కి పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చి కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. అంతవరకు ఓకే ఈ లేడీ అఘోరీ వస్త్రధారణ పాటించక పోవడంతో, పలు చోట్ల వివాదాలు సైతం సాగాయి. కార్తీకమాసంలో వైజాగ్ పర్యటనకు వెళ్ళిన అఘోరీ మాతకు అక్కడి గురువులు వస్త్రధారణ పాటించాలని, సమాజంలో తిరిగే సమయంలో తప్పక పాటించాలని సూచిస్తూ అక్కడే వస్త్రధారణ పాటించేలా చొరవ చూపారు.ఇక అక్కడి నుండి శ్రీకాళహస్తికి వెళ్లిన సమయంలో అయితే, వస్త్రధారణ పాటించక పోవడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడ ఆత్మార్పణకు యత్నించడం, సాయంత్రం ఎర్రటి వస్త్రాలు ధరించి స్వామి వారిని దర్శించడం శుభపరిణామం. ఆ తర్వాత దురదృష్టవశాత్తు కారుకు ప్రమాదం, ఆ తర్వాత యాగంటి దర్శనం కాలినడక సాగించడం కూడా తెలిసిందే. ఇక తెలంగాణలోకి ప్రవేశించిన అఘోరీ మాత శంషాబాద్ లో ఆలయానికి వెళ్ళిన సమయంలో పోలీసులకు, ఆమెకు వాగ్వివాదం సాగింది. అంతేకాదు ఇటీవల వేములవాడ ఆలయంలో దర్గాను సుత్తితో కొట్టి ధ్వంసం చేస్తానని ప్రకటించడం కూడా వివాదంగా మారింది.తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు లేడీ అఘోరీ. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద మంగళవారం లేడీ అఘోరీ హల్చల్ చేసింది. ఏకంగా చేతిలో కత్తి పట్టుకొని, అక్కడే గల బిగ్ టీవీ రిపోర్టర్ సెల్ ఫోన్ తీసుకొని నేలకేసి గట్టిగా కొట్టింది. దీనితో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు భయాందోళన చెందారు. అసలేం జరిగిందంటే..శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు లేడీ అఘోరీ మంగళవారం ఆలయం వద్దకు వచ్చింది. అయితే ఆలయ ప్రధాన ద్వారం నుండి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని అఘోరీ పట్టుబట్టగా, దుస్తులు ధరించి రావాలని సిబ్బంది సూచించారు. తనకే ఎదురు చెబుతారా అంటూ లేడీ అఘోరీ అగ్రహారం వ్యక్తం చేస్తూ.. ఆలయం వద్ద హల్చల్ చేసింది.ఆలయం వెలుపలకి వచ్చి తన వద్ద గల తల్వార్ తీసుకొని స్థానిక భక్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ దృశ్యాలను బిగ్ టీవీ ప్రతినిధి చిత్రీకరిస్తుండగా, మొబైల్ ఫోన్ లాక్కొని నేలకేసి బలంగా కొట్టింది. ఈ ఘటనతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆలయం వద్దకు చేరుకొని అఘోరీకి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. స్థానిక భక్తులు కూడ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అఘోరీ నిర్వాకంతో కొందరు భక్తులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అఘోరీ ప్రవర్తిస్తున్న తీరు కేవలం ప్రచారం కోసమే చేస్తుందన్న ఆరోపణలు తాజా ఘటనతో వినిపిస్తున్నాయి.
- Advertisement -