- Advertisement -
పద్మావతి ఆలయంలో లక్ష కుంకుమార్చన
Lakh kumkumarchana in Padmavati temple
తిరుపతి
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 28 నుండి డిసెంబర్ 6వ తేది వరకు జరగనున్న కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వ హించారు.ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనా మార్చన నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను శ్రీకృష్ణస్వా మి ముఖ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. సా యంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రో క్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు.ఉత్సవాల సందర్బం గా ఆలయాన్ని అత్యంత సుంద రంగా తీర్చిదిద్దారు.
- Advertisement -