Sunday, September 8, 2024

లక్ష్మారెడ్డి మెజారిటీ లక్ష పక్క- హరీష్ రావు

- Advertisement -

Lakshmareddy Majority Laksh Pakka- Harish Rao

ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి గారికి మద్దతుగా విఎన్ఆర్ గార్డెన్ లో మహిళ ఆత్మీయ సమ్మేళనం.”

వైద్య,ఆరోగ్య మరియు ఆర్ధిక శాఖ హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరుయ్యారు

మల్లాపూర్ : నవంబర్ 9 (వాయిస్ టూడే)ఉప్పల్ నియోజకవర్గం,మల్లాపూర్ డివిజన్, వియన్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ ఉప్పల్ నియోజక ఎమ్మేల్యే అభ్యర్థి శ్రీ బండారి లక్ష్మా రెడ్డి మద్దతుగా మహిళ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ వైద్య,ఆరోగ్య మరియు ఆర్ధిక శాఖ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీ పుర్ రాజు ,ఎమ్మేల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జీ రావుల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, పలువురు బిఅర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, పార్టీ మహిళా కార్యకర్తలు దాదాపు 5000 మంది పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి

సుభాష్ రెడ్డి మాట్లాడుతూ…

నాడు ఉప్పల్ నియోజకవర్గం మహిళలు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ లో తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాటి మంత్రులను నిలదీశారు.ఇవాళ కారు గుర్తుకు ఓటు వేస్తాం అని భారీ సంఖ్యలో వచ్చి మద్దతు తెలుపుతున్నారు.ఉప్పల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసుకున్నాము.ఇవాళ మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకున్నాము.మన ప్రభుత్వం సహకారంతో ఉప్పల్ స్కైవే ఏర్పాటు చేసుకున్నాము.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళులూ నిర్మించుకున్నాం,గడిచిన 10 సంవత్సరాల కాలంలో మన ఉప్పల్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము.రాబోయే ఎన్నికల్లో కూడా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో బండారి లక్ష్మా రెడ్డి గారిని గెలిపించాలి. అభివృద్ధిని కొనసాగించాలి అని కోరుతున్న.

ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ

ఇవాళ మహిళ సమ్మేళనికి వచ్చిన మహిళలకు కృతజ్ఞతలు.గడిచిన 10 సంవత్సరాల కాలములో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగిందిదేశంలో ఎక్కడ లేనివిధంగా ఇవాళ రాష్ట్రంలో మహిళ సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోంది.న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్, బీడీ కార్మికులకు పెన్షన్, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.మహిళలకు మా ట్రస్ట్ ద్వారా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నాం.
కేసీఆర్ భరోసా తో ఇవాళ రేషన్ కార్డు దారునికి సన్న బియ్యం, కకేసీఆర్ భరోసాతో ప్రతి ఇంటికి భీమా, పెన్షన్ పెంపు, గ్యాస్ 400 లకె ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్.మీరందరూ కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్న.

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ

అక్క చెల్లెళ్లు కొంత ఆలోచన చేయాలి. కేసీఆర్ వచ్చాక ఏంచేశారు…కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచన చేయాలి.పొద్దున లేస్తే మంచి నీళ్లకు ఇబ్బందులు ఎలా ఉండెనో గుర్తు చేసుకోవాలి.ఆనాడు మంచి నీళ్ళు కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారో కానీ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటింటికి నీళ్లు ఇస్తున్నారు.
ఆనాడు మహిళలు బిందలతో ఎక్కడో ఉన్న బోరు బావుల దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చే వారు కానీ ఇప్పుడు మీ ఇంట్లోకె నీళ్లు వస్తున్నాయి.మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చారు. ఇవాళ ఇదే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాఫీ కొట్టి హర్ ఘర్ కా జల్ అని పథకం పెట్టారు.
మనం ఇచ్చే మిషన్ భగీరథ పథకంను కేంద్ర ప్రభుత్వం స్వయంగా కొనియాడారు.
అప్పట్లో నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనేవాళ్ళు….కానీ ఇప్పుడు నేను పోత బిడ్డ సర్కార్ దవాఖానకు అంటున్నారు.
మీ బస్తి లొనే మీ సుస్థిని బస్తి దవాఖానలో నయం చేసినం.
ఉప్పల్ నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ మంజూరు చేశాం.ఇప్పటికే ఇక్కడ అనేక బస్తి దవాఖానలు వచ్చాయి. లక్ష్మా రెడ్డిని గెలిపిస్తే మరిన్ని బస్తి దవాఖానలు వస్తాయి.మునపటి లాగా వైద్య రంగం ఉందా….పిల్లలు పుడితే ఇంటి దగ్గర దించే వరకు కూడా మనదే బాధ్యత.కేసీఆర్ కిట్ ఇచ్చారు మన కేసీఆర్. ఆడబిడ్డకు అండగా మన కేసీఆర్ నిలిచారు.
ఆడబిడ్డకు మేనమామ లాగా కల్యాణ లక్ష్మీ తెచ్చారు.
మొదట 50 వేలు ఇచ్చారు….తరువాత75 వేలు ఇప్పుడు100116 ఇస్తున్నారు.
కడుపులో బిడ్డ పడ్డప్పుడు నుండి బిడ్డ పెళ్లి అయ్యే వరకు మన ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది.పిల్లల చదువు కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు.పిల్లల విదేశీ విద్య కోసం “విదేశీ విద్య” పథకం పెట్టారు.
కేసీఆర్ వచ్చాక హైదరాబాద్ లో ఒక్క పేకాట క్లబ్ లేదు అన్ని క్లోజ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ ఈ పేకాట క్లబ్ వస్తాయి అవి వస్తే మళ్ళీ మహిళల పుస్తెలు అమ్ముడే.
అంటే కాంగ్రెస్ గెలుచుడు వద్దు…..ఈ పేకాట క్లబ్ ల గబ్బు వద్దు.కేసీఅర్ చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించారు.
మొదట పెన్షన్ 1000 రూపాయలు ఉండే తరువాత రెండు వేలు చేశారు ఇప్పుడు 5 వేలు చేస్తాం అంటున్నారు మన ముఖ్యమంత్రి
మాట తప్పని ముఖ్యమంత్రి కేసీఆర్.ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం పెట్టిన మహిళల పేరుతోనే పెట్టారు.గృహ లక్ష్మీ, కల్యాణ లక్ష్మీ, ఇప్పుడు సౌభాగ్య లక్ష్మీ పెట్టారు.
ఈ సారి కారు ఓటు వేసి గెలిపించండి ప్రతి రేషన్ కార్డు ఉన్నవారికి రేషన్ షాప్ లలో సన్న బియ్యం ఇస్తాం అని మన ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాడు.
30 నాడు కారుకు ఓటు గుద్దుర్రి….. తరువాత సన్న బియ్యం పట్టుర్రి.
సంవత్సరం కు 113000 రూపాయల పథకాలతోపాటు గ్యాస్ సిలిండర్ 400 కె ఇస్తాం.
బీజేపీ వాళ్ళు మహిళల గోస పుచ్చుకుంటుంది. అందుకే మన ముఖ్యమంత్రి 400 కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు.చెప్పుడు మాటలు విని బీజేపీ,కాంగ్రెస్ ఓటు వేసుడు అవసరమా….నమ్మకానికి మారు మన కేసీఆర్
కర్ణాటక లో ఇవాళ కరెంట్ కటకటలు ….గ్యారెంటీ లు లేవు పాడు లెవు అలాంటి కాంగ్రెస్ మనకు అవసరమా.
ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక కరువు లేదు….కర్ఫ్యూ లేదు
ఆనాడు కాంగ్రెస్ అయంలో కర్ఫ్యూ లు …కరవులు.రాజస్థాన్ లో ఇవాళ మహిళలకు రక్షణ లేదు.అలాంటి కాంగ్రెస్ పార్టీ మనకు ఎందుకు.
షి టీం లు పెట్టి ఇక్కడ ప్రతి మహిళకు రక్షణ కల్పించారు.
కేసీఆర్ భీమా …..ప్రతి ఇంటికి ధీమా అనే పథకం ఇవాళ పెట్టుకున్నము.ప్రతి కుటుంబానికి ఈ 5 లక్షల ఆర్ధిక భరోసా ఇస్తుంది
రైతు భీమాతో ఎన్నో కుటుంబాలకు ఆసరా అయ్యాయి….ఇవాళ కేసీఆర్ భీమా తో కూడా ప్రతి కుటుంబానికి ఆసరా అవుతుంది.
లక్ష్మా రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న.
కారు గుర్తుకు ఓటు వేసి మల్లోక్కసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్