- Advertisement -
పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం
Large seizure of marijuana
హైదరాబాద్, డిసెంబర్ 30
నూతన ఏడాLarge seizure of marijuanaది వేడుకలకు సిద్ధమవుతున్ వేళ హైదరాబాద్ నగరంలోకి అక్రమంగా నిషేధిత మత్తు పదార్థాలు, మద్యం ప్రవేశించకుండా పోలీసులు నిఘా పెంచారు. నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతూ.. డ్రగ్స్, మద్యం తరలింపును నిరోధిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు వేరువేరు ఘటనల్లో గంజాయి చాక్లెట్లు, అక్రమ మద్యాన్ని తెలంగాణ పోలీసులు గుర్తించి, సీజ్ చేశారు.పోలీసుల కఠిన ఆంక్షలతో మత్తు పదార్థాలు సప్లై చేసే వాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఇప్పటి వరకు సిగరేట్లు, పొడి సహా ఇతర రూపాల్లో తరలించిన గంజాయిని చిన్నారులు తినే చాక్లెట్ల రూపంలో తయారు చేసి బోర్డర్లు దాటిస్తున్నారు. అలా ఒరిస్సా నుంచి హైదరాబాద్ లోకి వస్తున్న చాక్లెట్ గంజాయిని తాజాగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్తా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ కు గంజాయి చాక్లెట్లు తరలిస్తున్నారనే సమాచారం అందడంతో సరిహద్దుల్లో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే కోదాడ రాంపూర్ క్రాస్ రోడ్ దగ్గర ఓ బస్సులోని ప్రయాణికుడి వద్ద నిందితుడిని పోలీసులు గుర్తించారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కు చాకెట్ల రూపంలో తరలిస్తున్న గంజాయిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల తనిఖీల్లో దొరికిపోకుండా, ఎవరికీ అనుమానం రాకుండా చిన్నపిల్లల చాక్లెట్ల మాదిరిగా చుట్టి ఉంచిన వెయ్యికి పైగా గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న అనిల్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి చాక్లెట్లను ఒరిస్సా కార్మికులు ఎక్కువగా పని చేసే ప్రాంతాల్లో విక్రయించనున్నట్లు నిందితుడు తెలపగా, ఒక్కో చాక్లెట్ ను రూ.30 లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తున్న అనిల్ కుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు కోదాడ ఎక్సైజ్ సీఐ శంకర్ వెల్లడించారు.మరో ఘటనలో గోవా నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న అక్రమ మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో.. ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న వాస్కోడిగామా రైలులో అక్రమ మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లుగా తెలుసుకుని.. ఒకేసారి తనిఖీలు చేపట్టారు.శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు తనిఖీలు నిర్వహించగా.. పలువురు వద్ద 43 మద్యం బాటిళ్లను గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వీటి విలువ రూ. 2 లక్షల మేర ఉంటుందని తెలిపారు.న్యూ ఇయర్ సెలబ్రేషన్లకు సిద్ధమవుతున్న వేళ నగరంలోకి అక్రమ మద్యం, నిషేధిత డ్రగ్స్ ప్రవేశించే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వేడుకలకు ముందు నుంచే ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు. ఈ చర్యల కారణంగానే నగరంలోకి ప్రవేశిక ముందే అక్రమ మద్యం, గంజాయి చాక్లెట్లు సహా ఇతర మత్తు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణాను డ్రగ్స్ రహితంగా మార్చాలని పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా.. ముఖ్యంగా హైదరాబాద్ లో గంజాయి సహా మరే ఇతర నిషేధిత డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి పటిష్ట నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, అనుమానాస్పద ప్రాంతాల్లో నిత్యం సోదాలతో డ్రగ్స్ రవాణా, విక్రయం, వినియోగాన్ని పూర్తిస్థాయిలో కట్టడం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
- Advertisement -