‘హర్ దిల్ మే -సబ్ జగన్ కే సాత్ ‘ కరపత్రాలు  ఆవిష్కరణ

- Advertisement -

తిరుపతి:  రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి   ఆదేశాల మేరకు  ఆంద్ర రాష్ట్ర వైసార్సీపీ వక్ప్ బోర్డ్ చైర్మన్ మరియు మైనారిటీ అధ్యక్షులు వి . ఖాదర్ బాషా   సూచనలతో    తిరుపతి జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ . సిరాజ్ బాషా తిరుపతి జిల్లా వక్ఫ్ బోర్డ్ … శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ్యులు   బియ్యపు మధుసూదన్ రెడ్డి  నాయకత్వంలో హర్ దిల్ మే వైఎస్సార్ హమ్ సబ్ జగన్ కే సాత్ కరపత్ర ఆవిష్కరణ చేశారు .

ఈ సందర్బంగా దివంగత నేత డా ; వై యస్ రాజశేఖరెడ్డి మైనారిటీలపై చూపిన ప్రేమను తలుచుకుంటూ, మైనార్టీల సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని వాటి పరిష్కరానికి తమ వంతు ప్రయత్నం చేస్తా అని తెలుపుతూ  గతంలో చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీలంటే కపట ప్రేమను చూపేవారని దానికి నిదర్శంగా 4 ఏళ్లలో ఒక్క మైనార్టీకు కూడా క్యాబినెట్లో అవకాశం కల్పించలేదని, చివరి సంవత్సరం మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు.అలానే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్  అలా కాకుండా మొదట్లోనే కేవలం మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా కలలో కూడా ఊహించని విధంగా ఒక మైనార్టీ ఎమ్మెల్యేకు ఉపముఖ్యమంత్రి స్థానాన్ని , ఎం ఎల్ సీ లు , చైర్మన్ లు, మార్కెట్ యార్డ్ చైర్మన్,మున్సిపల్ చైర్మన్ లు ఇంకా మరెన్నో పదవులు కట్టబెట్టారని తెలిపారు. అందుకు కృతజ్ఞతగా మన ముస్లిం మైనార్టీ సోదరులంతా వచ్చే ఎన్నికల్లో అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు మజిదే మొహమ్మదియా & మదీనా మజీద్. మసీదుల ముతవల్లిలు ఇమాంలు  ముస్లిం మత  పెద్దలు , వైయసార్సీపీ సీనియర్ నాయకులు కార్యక్తలు పాల్గొన్నారు . . కరీముల్లా మహమ్మద్ అలీ లాల్ బాషా అబ్దుల్ హమీద్ మొహమ్మద్ గౌస్ దావూద్ తదితరులు పాల్గోన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular