- Advertisement -
చట్టం తన పనిని తాను చేసుకుంటుంది….
Law will do its job….
హైదరాబాద్, డిసెంబర్ 13, (వాయిస్ టుడే)
పార్లమెంట్ లాబీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు. ఆయన విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో తన జోక్యం ఏమీ ఉండదని.. తొక్కిసలాటలో చనిపోవడం వల్లే పోలీసుల చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని గుర్తు చేశారు. క్యాబినెట్ విస్తరణ పై చర్చ లేదన్నారు. ఓవైపు సీరియస్ గా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి.. ఇంకో వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయిని.. క్యాబినెట్ విస్తరణ జరగాలంటే పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, ముఖ్యనేతలతో చర్చలు జరగాలన్నారు. అంటే ఇప్పుడల్లా మంత్రి వర్గ విస్తరణ ఉండదని తేల్చేసినట్లయింది. అల్లు అర్జున్ వంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోను ముఖ్యమంత్రికి తెలియకుండా అరెస్టు చేస్తారా అన్నదానిపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయారు. ఈ అంశం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురి అయింది. రేవంత్ రెడ్డి .. ఎవరికీ గుర్తుండడని బీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేశారు. సినిమా వాళ్లు రేవంత్ రెడ్డిని సీరియస్ గా తీసుకోవడం లేదన్న అసంతృప్తి కాంగ్రెస్ వర్గీయుల్లో ఉంది. దీంతో అసలు షాక్ ట్రీట్ మెంట్ ఎలా ఉంటుదో చూపించాలన్న ఉద్దేశంతో ఈ అరెస్టుకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.అదే సమయంలో సెలబ్రిటీలు ఏం చేసినా పోలీసులు ఏమీ చేయలేరన్న అ అపవాదు ఉంది. అల్లు అర్జున్ తో పాటు మోహన్ బాబు కుటుంబంలోనూ జరిగిన పరిణామాలతో ఏర్పడిన ఘర్షణలు, మోహన్ బాబు చేసిన హత్యాయత్నం ఘటన సంచలనంగా మారింది. ఈ క్రమంలో సెలబ్రిటీలకూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని సంకేతాలు పంపారని అంటున్నారు. అర్జున్ అరెస్టు విషయంలో పోలీసులు ఇంత దూకుడుగా ఎలా నిర్ణయం తీసుకున్నారన్నది కూడా అర్జున్ క్యాంప్ భిన్నంగా స్పందిస్తోంది. సంధ్యా ధియేటర్ ఘటన విషయంలో తన తప్పేం లేదని వాదిస్తూ అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉన్న సమయంలోనే అరెస్ట్ చేశారు. మాములుగా ఇలాంటి పిటిషన్లు కోర్టుల్లో ఉంటే పోలీసులు ఇంత దకుడుగా నిర్ణయాలు తీసుకోరని అంటున్నారు
- Advertisement -