చట్టాలు ఎవరికి చుట్టాలు కావు జర జాగ్రత్తగా మసులుకోండి
డిఎస్పి శివ నారాయణ స్వామి
కౌతాళం
Laws do not bind anyone
చట్టాలు ఎవరికి చుట్టాలు కావని చట్టం దృష్టిలో అందరూ సమానమేనని డి.ఎస్.పి శివ నారాయణస్వామి పేర్కొన్నారు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి కోస్గి సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్త చట్టాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకొని కనీసం వాటిపై అవగాహన కల్గి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని 18 ఏళ్లలో పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఫోర్ వీలర్స్ డ్రైవింగ్ చేయించడం నేరమని తెలుసుకోవాలని అలా చేసిన వారికి వారి తల్లిదండ్రులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని అన్నారు. 1860లో రచించిన ఐపిసి 1872లో రచించిన ఐ ఈ ఏ 1873లో రచించిన సి ఆర్ పి సి స్థానాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కొత్త చట్టాలు బిఎన్ఎస్ , బిఎన్ఎస్ఎస్ భారతీయ సాక్ష్య ధ్యానం మేరకు 2023 జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయని ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటపతి రాజు, సర్పంచ్ పాల్ దినాకర్, సతీష్ నాయుడు ,వీరేష్ ,సిపిఎం మల్లయ్య, మాజీ సర్పంచ్ అవతారం, రాజబాబు,జగదీష్ , కాశీ విశ్వనాథ్ మారెప్ప తదితరులు ఉన్నారు.