Sunday, September 8, 2024

ఆంధ్రా ముసుగులో నాయకులు వస్తున్నారు, నమ్మవద్దు

- Advertisement -

మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ :  బిఆర్ఎస్ పార్టీ నే మా భవిష్యత్తు అని ప్రజలు నమ్ముతున్నారు. వ్యవసాయానికి పనికిరాని భూములు ఇప్పుడు కాళేశ్వరం నీటితో కలకలాడుతున్నాయి. కరువు నుండి అద్భుతమైన పంటలు పండే రోజులు వచ్చాయి. ఆంద్రా వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ ముసుగుతో వచ్చి ఆంధ్రాలొ కలపాలని చూస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. రేపు అధికారం ఢిల్లీ చేతిలో కాదు,కెసిఆర్ చేతిలో పెట్టాలి. తెలంగాణ యువత భవిష్యత్తు కెసిఆర్ కాపాడుతారు. మూడవసారి మమ్ములని  గెలిపిస్తారు.   ముడుసార్లు గెలిపించారు, నాలగవ సారి  మరోక అవకాశం ఇవ్వండి ఇంకా అభివృద్ధి చేస్తాను. మానేరు రివర్ ఫ్రంట్ వస్తే ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ పాలనలో వలసలు తగ్గిపోయాయి. ఆంధ్రా ముసుగులో లిడర్లు వస్తున్నారు, నమ్మవద్దు. యువత భవిష్యత్తు బాగుండాలంటే కెసిఆర్ రావాలి. కాంగ్రెస్ బిజెపి పాలకులు ఆంధ్రాలో కలుపుతారు. కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే మరొక అవకాశం ఇవ్వండి. డబుల్ ఇంజన్ అంటే ముఖ్యమంత్రి కెసిఆర్, కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల ఉండాలి. పదమూడు నియోజకవర్గాలలో బిఆర్ఎస్ జెండా ఎగురుతుంది. కెసిఆర్ లేని తెలంగాణ ని ఊహించుకొనే పరిస్థితి లేదు. కెసిఆర్ లేని తెలంగాణ ఆంటే నెర్రలు వారిన తెలంగాణ నే. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నవారికి ఓటు వేయవద్దు. భూ ఖబ్జా చేతుల్లోకి, మతతత్వ పార్టీ చేతుల్లోకి అధికారం పోవద్దు. 18 నుండి అందరం రంగంలోకి దిగుతాం. ఎన్నికలప్పుడు వచ్చిన వారిని నమ్మవద్దు. ఈటెల రాజేందర్ భయపడే హుజురాబాద్ లోనూ పొటీ చేస్తాను అంటున్నారు. ఈటెల రాజేందర్ బిజెపి పార్టీలో తన ఆధిపత్యం కొరకే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ భీపాం లు బిజేపి ఆపీసులో,కాంగ్రెస్ ఆపిసులో బిజేపి పార్టీ భీపాం తయ్యారు అవుతాయి. హైదరాబాదు సంపద కొల్లగొట్టడానికే వస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి తెలంగాణ గురించి ఎందుకు. అటూ ఇటూ అయితే తెలంగాణ ఎత్తుకుపొవడానికి చూస్తున్నారు.

Leaders are coming in the guise of Andhra, don't believe it
Leaders are coming in the guise of Andhra, don’t believe it

బండిసంజయ్ గంజాయి  ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గంజాయిని ఎవరైనా ప్రోత్సహిస్తారా? కరీంనగర్ గంజాయి రహితంగా గా ఉండాలని సిపి గారికి ఇంతకు ముందే  చెప్పామని అన్నారు.

2019 లో మాకు పేపర్లో అడ్స్ కి కూడా అవకాశం ఇవ్వలేదు…అప్పుడుకూడా సర్వేలు కాంగ్రెస్ కే అన్నారు,మేమే అధికారం లోకి వచ్చాం. సర్వేలన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయి. కర్ణాటక లో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పరిపాలనలో విఫలం అయ్యింది. కర్ణాటక లో పథకాలు అమలు చెయడానికి ఇబ్బందులు పడుతున్నారు.. ఇక్కడ ఆరు గ్యారంటీలు ఏం ఇస్తారు. బిజేపి పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు… ఈటెల సీఎం ఎలా అవుతాడని ప్రశ్నించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్