- Advertisement -
అఖిల ను సన్మానించిన ఎం హెచ్ పి ఎస్, టీడీపీ నాయకులు
Leaders of MHPS and TDP honored Akhila
నరసరావుపేట,
పల్నాడు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు షేక్ అఖిల మస్తాన్ వలి ను (ఎం హెచ్ పి ఎస్) ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ వలి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మస్తాన్వలి మాట్లాడుతూ, కష్టకాలంలో టీడీపీ పార్టీ అభివృద్ధి కోసం కస్టపడి పని చేసిన వారికీ మంచి పదవులు వస్తాయి అనటానికి షేక్ అఖిల మస్తాన్వలి ఉదాహరణ అన్నారు. ఎస్.కె అఖిల, స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తో నిత్యం పార్టీ కోసం పని చేసిన, అఖిల మస్తాన్ వలి కష్టాన్ని గుర్తించి ఆమెకు పల్నాడు జిల్లా సమాఖ్య అధ్యక్షులు గా నియమించి ముస్లిం ల పట్ల తనకు వున్న అభిమానానికి చూపించిన శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ని ఈ సందర్బంగా ధన్యవాదములు తెలుపుతూ, అఖిల మస్తాన్ వలి ని సన్మానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో తెలుగు దేశం నరసరావుపేట నియోజకవర్గం సీనియర్ నాయకులు, వాసిరెడ్డి రవి, కొవ్వూరు బాబు, మైనారిటీ నాయకులు, మాబు, వలి, ఖాసీంపిరా, కరీముల్లా, రహమాత్ అలీ, బాజీ సుభాని రసూల్, ఖలీల్, జాఫర్, ఇమాంసా, మీరసా, లతీఫ్, ముస్లిం మహిళలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -