శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మున్నూరు కాపు సంఘం నాయకులు

- Advertisement -

శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మున్నూరు కాపు సంఘం నాయకులు

Leaders of the Munnur Kapu community visited Srisailam Mallikarjuna Swamy Temple

Leaders of the Munnur Kapu community visited Srisailam Mallikarjuna Swamy Temple
Leaders of the Munnur Kapu community visited Srisailam Mallikarjuna Swamy Temple

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ మున్నూరు కాపు సంఘం నాయకులు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ నిత్య అన్నదాన సత్రంలో బస చేసి, ఉదయం స్వామివారి స్పర్శ దర్శనం చేసుకున్నారు.

అనంతరం సున్నిపెంటలోని శ్రీశ్రీశ్రీ పూర్ణానంద స్వామి ఆశ్రమంలో అల్పాహారం సేవించిన తరువాత, శ్రీశైలం టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఘంటా సుబ్బారావును శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఎర్ర నాగేంద్రబాబు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆకుల రజిత్, ప్రముఖ తెలంగాణ కవి దుర్గం రవీందర్, హైకోర్టు అడ్వకేట్ ఉసా రఘు, ప్రవీణ్ కుమార్, ఎస్. రాజేందర్, మున్నూరు కాపు సంఘం నాయకులు ఆవుల రామారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొని సర్కిల్ ఇన్స్పెక్టర్‌ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular