బెజవాడ వరద బాధితులకు అండగా మేము సైతం అంటూ కదలిన
నాయకులు
Leaders stood by the flood victims of Bejawada
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మనందరి భాద్యత.
జొన్నగిరిలో వరద బాధితుల విరాళాలు సేకరణ
తుగ్గలి
తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులు కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న
భారీ వర్షాలకు విజయవాడ నగరంలోని ప్రజల ఇల్లు,పంట పొలాలు నీటి మునిగి సర్వం కోల్పోయిన వరద బాధితులకు చేదోడుగా జొన్నగిరి టిడిపి యువ నాయకులు మిద్దె వెంకటేష్ యాదవ్, జొన్నగిరి సర్పంచ్ ఓబులేష్,టిడిపి తాలూకా రైతు సంఘం ఉపాధ్యక్షులు బాలన్న,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మిద్దే రవి యాదవ్ మరియు వారి మిత్ర బృందం శుక్రవారం మండల పరిధిలోని జొన్నగిరిలో విజయవాడలో వరదల్లో చిక్కుకొని ఆకలితో అలమటిస్తున్న బాధితులకు సహాయం చేయడం కోసం టిడిపి నాయకులు విరాళాలు ఇస్తూ గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి విరాళాలు సేకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యత అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరదల్లో చిక్కుకున్న బాధితులను కాపాడుకోవడం కోసం తానే బాదితుల వద్దకు వెళ్లి పరామర్శించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం చాలా గొప్ప విషయమని,ఆయన 75 ఏళ్ల వయసులో నడుము లోతు నీళ్లలో వెళుతూ బాధితులకు కిట్లు అందిస్తూ అండగా నిలబడ్డారన్నారు.ఆయనకు అండగా మనం కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వడం ఎంతో సంతోషమని,ఈ విరాళాలు అన్నిటిని పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాం కుమార్ కి అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సంఘాల కృష్ణ, సోము,బలరాముడు,హోటల్ మళ్లీ, జయ రాముడు,అంజి,జయచంద్ర, గ్రామ పెద్దలు,టిడిపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.