అంబర్ పేట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్
హైదరాబాద్ నవంబర్ 7 : ప్రజల కోసం పనిచేసే నాయకుడికే ప్రజలు గుర్తించి పట్టం కడతారని అంబర్పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు. మంగళవారం అంబర్ పేట నియోజకవర్గం పరిధిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల పదవీకాలంలో తాను చేసిన అభివృద్ధి సంక్షేమ వివరిస్తూ తనను మరోసారి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు.ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్ పేటలోని పటేల్ బాడ, ప్రేమ్ నగర్ మరియు పటేల్ నగర్ లో అంబర్ పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచార పాదయాత్రకు అడుగడునా ఘన స్వాగతం లభించింది.బంగారు తెలంగాణ సాధనకు కట్టుబడి పనిచేస్తున్న బీఆర్ఎస్ ను మరో సారి గెలిపించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రజలకు విజ్ఞప్తులు చేస్తూ, తాము అమలు చేస్తున్న, చేయబోయే సంక్షేమాభివృద్ధి పథకాలను వివరించారు.
బీజేపీ నుండి బీఆర్ఎస్ లోకి
అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బిజెపి నాయకురాళ్లు హేమలత,లక్ష్మి,అన్నపూర్ణ, మాధవి,పద్మ,ప్రేమ్ నగర్ గ్రీన్ లాండ్ గల్లీలో దాదాపు 500 మంది మహిళలు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు.ఈ కార్యక్రమంలో ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జాఫర్,పార్టీ నాయకులు,మహిళా నేతలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.