వీలైనంత త్వరగా దేశం విడిచి  ఇండియాకి వెళ్లిపోండి

- Advertisement -

తీవ్రమవుతున్న ఖలీస్థాన్ ఉద్యమం

Leave the country and go to India as soon as possible
Leave the country and go to India as soon as possible

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20:  కెనడాలో ఖలిస్థానీ ఉద్యమం ఉద్ధృతమవుతోంది. ఇప్పటికే భారత్, కెనడా మధ్య ఈ విషయంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఖలిస్థాన్ వేర్పాటువాద సమస్యని ఎలా పరిష్కరించుకోవాలనే దానిపై చర్చించారు. ఈ క్రమంలోనే ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థ.కెనడాలోని హిందువులకు వార్నింగ్ ఇచ్చింది. వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. SFJ లీగల్ కౌన్సిల్ గురుపత్వంత్ సింగ్ పన్నన్  ఈ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. హిందువులందరూ వెంటనే కెనడా విడిచి వెళ్లిపోవాలని బెదిరించాడు. “కెనడాలోని హిందువులంతా వీలైనంత త్వరగా ఇండియాకి వెళ్లిపోండి. మీరు సపోర్ట్ చేసేది ఇండియాకి మాత్రమే కాదు. ఖలిస్థాన్ మద్దతుదారుల భావ ప్రకటనా స్వేచ్ఛని అణిచివేయడాన్నీ సపోర్ట్ చేస్తున్నారు. ఖలిస్థాన్‌కి మద్దతునిచ్చే సిక్కుల వాక్‌ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నారు. షహీద్ నిజ్జర్‌ని దారుణంగా హత్య చేస్తే దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు”

– గురుపత్వంత్ సింగ్ పన్నన్, సిక్స్ ఫర్ జస్టిస్

ఖలిస్థాన్ మద్దతుదారులు చాలా గొప్ప ఉద్యమం చేస్తున్నారని, దేశ చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే ఉద్యమిస్తున్నారని స్పష్టం చేశారు గురుపత్వంత్ సింగ్. అయితే…భారత్ మాత్రం గురుపత్వంత్‌ని టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ఈ వీడియో వైరల్ అవడం వల్ల మరోసారి ఉద్రిక్తత నెలకొంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular