- Advertisement -
అమిత్ షా వ్యాఖ్యలపై వామపక్షాల నిరసన
Left protests over Amit Shah's comments
విశాఖపట్నం
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విశాఖలో వామపక్ష పార్టీల నాయ కులు నిరసన వ్యక్తం చేశారు. నగ రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ క్రమంలో దిష్టి బొమ్మను దగ్ధం చేసే క్రమంలో పోలీసులకు నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్పై కేంద్ర హౌమ్ శాఖ మంత్రి అమిత్షా అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ, అంబేద్కర్ను అభిమానించే వారిని ఎగతాళి చేస్తూ, అంబేద్కర్ జపం చేయడం ఫ్యాషన్గా మారిం దనీ, ఆ జపమేదో దేవుడిని తలుచుకుంటే స్వర్గమన్నా వచ్చే దంటూ అత్యంత అవమానకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈ వ్యాఖ్యలను దేశం యావత్తు ఖండించి, దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అయినా అమిత్షా, ప్రధాని మోడీ ఏమీ పట్టనట్టే ఉన్నారని తెలిపారు. పైపెచ్చు ప్రధాని మోడీ, అమిత్ షా వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లా డుతున్నారని తెలిపారు. రాజ్యాం గం గురించి పార్లమెంటులో చర్చ జరుగుతుండగా, ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించడ మంటే, రాజ్యాంగాన్నే అవమానిం చడం అని, పరోక్షంగా రాజ్యాంగాన్ని కూదా తిరస్కరించడమే అవుతుం దని అన్నారు. మోడీ సర్కార్ ఓ రాజ్యాంగం గురించి నిత్యం జపం చేస్తూ, మరోవైపు అదే రాజ్యాం గానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
- Advertisement -