వృద్ధులను వేధిస్తే చట్టపరంగా చర్యలు
జగిత్యాల
వయోవృద్ధులను వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూరం వేణుగోపాల్ అన్నారు.
మంగళవారం జగిత్యాల జిల్లా సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ప్రతినిధులు సర్కిల్ ఇన్స్పెక్టర్ ను కలిసారు.పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి,సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆవిర్భావ ప్రత్యేక సావనీర్ ను అందజేసీ సత్కరించారు.ఈ సందర్భంగా జిల్లా సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ సీనియర్ సిటిజెన్లపై జరుగుతున్న వేదింపులను సి.ఐ. దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా
సి.ఐ.మాట్లాడుతూ సీనియర్ సిటీజన్లను వేధింపులకు గురిచేసే వారిపై పోలీసు శాఖ పరంగా కౌన్సెలింగ్ చేసి,తగు చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,గౌరవ సలహాదారు,మాజీ మున్సిపల్ చైర్మన్ జీ.ఆర్.దేశాయ్,ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,పట్టణ అధ్యక్షుడు పి.సతీశ్ రాజ్,కోశాధికారి సింగం గంగాదర్,ఎం డి.యాకుబ్,పుల్లూరి సత్యనారాయణ, పడాల శ్రీనివాస్, ములస్తం శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.