సేంద్రియ ఎరువులతో భూసారాన్ని పెంచుదాం
Let's increase the soil fertility with organic fertilizers
అధిక దిగుబడులు సాధిద్దాం
రసాయనిక ఎరువులు వద్దు….
సేంద్రియ ఎరువులు ముద్దు
ఆళ్లగడ్డ
రసాయన ఎరువులు వద్దని..
సేంద్రియ ఎరువులు ముద్దని.. సేంద్రియ ఎరువులతోనే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని వినూత్న ఆగ్రోటెక్ ప్రతినిధులు అన్నారు. సోమవారం ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలోని సిరివెళ్ల మండలం గోవిందపల్లి గ్రామంలో వినూత్న ఆగ్రోటిక్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ బిల్లా రాజేష్ యాదవ్ ఏఎస్ఎం .మోహన్ కుమార్, ఎస్ ఓ. మస్తాన్ ,ఎఫ్ఎ వెంకన్న తదితరులు పాల్గొని రైతు సోదరులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రసాయనిక ఎరువులు వాడటం వలన భూసారం దెబ్బతిని వాతావరణం కలుషితమవుతుందని వారు గుర్తు చేశారు. తద్వారా పంటలకు చీడపురుగులు పెరిగిపోయి దిగుబడి తగ్గిపోతుంది అని పేర్కొన్నారు సేంద్రియ ఎరువులో వాడటం వలన భూసారం పెరగడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించవచ్చు అన్నారు అందువలన రైతులు సేంద్రియ ఎరువులు వాడాలని వినుత్న ఆగ్రోటెక్ ఎల్ఎల్ పీ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ బిల్లా రాజేష్ యాదవ్ అన్నారు అదేవిధంగా రైతులు పండిస్తున్న వివిధ పంటలలో సస్యరక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రైతు సదస్సు కార్యక్రమంలో నేటి వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు రసాయన మందులు వాడటం నానాటికి పెరిగిందన్నారు వీటి ప్రభావం వల్ల మనకు తెలియకుండానే భూమిలో ఉన్న జీవరాశులపై అధికంగా ఒత్తిడి పెరగడంతో పాటు అధిక రసాయన ఎరువులు వాడటం వల్ల భూమిలోని జీవరాశులలో అతి ముఖ్యమైన సముదాయమైన సూక్ష్మంగా జీవుల పైన పడి వాటి సంఖ్య తగ్గిపోతుంది అన్నారు తద్వారా గణనీయమైన మార్పులు భూమిలో సంతరించుకుని భూమికున్న సహజ గుణాలు మరియు ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షమిస్తుందన్నారు తద్వారా రైతుకు పెట్టుబడి విషయంలో అధికమై భారం కూడా పడుతుందన్నారు వినూత్న ఆగ్రోటెక్ ఎల్.ఎల్.బి సంస్థ గత రెండు సంవత్సరాలుగా సేంద్రియ జీవన ఎరువులు అందిస్తుందన్నారు సేంద్రియ ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి తగ్గడంతో పాటు భూమి సారవంతంగా తయారవుతుందన్నారు