- Advertisement -
మన గుడిలను పరిరక్షించుకుందాం-విశ్వహిందూ రక్ష పరిషత్
Let's protect our temples - Vishwahindu Raksha Parishad
హైదరాబాద్
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలైన మన గుడులను పరిరక్షించుకోవాలని విశ్వహిందూ రక్షా విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ మహిళ విభాగం అధ్యక్షురాలు యమునా పాఠక్ ఇందుకు సంబంధించిన పోస్టర్ను బంగారయ్య శర్మతో కలిసి ఆవిష్కరించారు. సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా మన గుడి మన బలం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని యమునా తెలిపారు ఆలయాలు మన సంస్కృతి, మన సంప్రదాయాలకు నిలయాలు, అలాంటి ఆలయాలు అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలన్నారు. దేశ సంస్కృతి మొత్తం దేవాలయాల్లో దాగి ఉందని ఆ దేవాలయాలను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని అన్నారు. ఇందుకోసం తమ సంస్థ ప్రతి దేవాలయాన్ని సందర్శిస్తూ ఆయా దేవాలయాల పటిష్టతకు కృషి చేస్తుందని అన్నారు. అన్యాక్రాంతం అవుతున్న దేవాలయాల భూములను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
- Advertisement -