Sunday, September 8, 2024

ఓటమిని సమీక్షించుకుందాం కేటీఆర్

- Advertisement -

ఓటమిని సమీక్షించుకుందాం
కేటీఆర్
హైదరాబాద్
ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గస్థాయి సమావేశం  తెలంగాణ భవన్ లో జరిగింది. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ .ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు

బిఆర్ఎస్ పార్టీ ని పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనం.  39 ఎమ్మెల్యే సీట్లను గెలవడం తో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీ తో చేజారిపోయాయి. .ఇంకా కొన్ని చోట్ల మరికొన్ని

కారణాలచేత కోల్పోయాం. .ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకుని ముందుకు సాగుదామని అన్నారు.
ఇప్పటికీ జరిగిన సమావేశాల్లో ఆత్మవిమర్శ జరిగిన సంగతి తెలిసిందే.ఖమ్మం  సమీక్ష 7 వది.  రాష్ట్రం లో కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పాటై నెలదాటింది. వచ్చిన తెల్లారినించే మా వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలాయపన దిశగా అడుగులేస్తున్నదని ఆ పార్టీ నెల రోజుల పోకడ స్పష్టమౌతున్నది.
వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రేస్ ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైంది. ఇదిలాగే కొనసాగే పరిస్థితి ఉన్నది. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలం లో కోల్పోయే లక్షణం కాంగ్రేస్ పార్టీ సొంతం.

గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది కూడా అదేనని అన్నారు. 1983 లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన అనంతర రాజకీయపరిణామాలను గమనిస్తే ఈ విషయం అర్థమౌతుంది. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పి ని

తిరస్కరించి కాంగ్రేస్ గెలిపించిన ప్రజలు కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రేస్ పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రేస్ పార్టీ అనంతరం జరిగిన నాటి లోకసభ ఎన్నికల్లో ఘోర

పరాజయం పాలయ్యింది. ఆ ఎన్నికల్లో అదే ప్రజలు టీడీపీ ని తిరిగి భారీ మెజారిటీ తో గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ వాస్తవం మనం మరువగూడదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ చిత్తశుద్ధి

కాంగ్రేస్ పార్టీ కి వుండదు అనేది గత నెల రోజుల ఎన్నికల అనంతర పరిణామాలను పరిశీలిస్తే మరోసారి రుజువైంది. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుకోసం కాంగ్రేస్ పార్టీ మీద వత్తిడితెస్తూ తెలంగాణ ప్రజలకోసం బిఆర్ఎస్

పార్టీ పోరాడుతుంది. .ఈ దిశగా మనందరం కార్యోన్ముఖులం కావాల్సివుంటుందని అన్నారు.
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో నాయకుల మధ్య విబేధాలు ఎక్కువ అయినాయి అందుకే మనం అత్యధిక స్థానాలు ఓడి పోయాము. ఇక నుండీ వర్గ విభేదాలు పక్కన పెట్టి రాబోయే

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. లేకపోతే పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్