మంథని మహనీయుల చరిత్రను చాటుదాం

- Advertisement -

మంథని మహనీయుల చరిత్రను చాటుదాం

Let's share the history of Manthani Mahaney

-విగ్రహాలు,వీధులకు పేర్లు, స్వాగత అర్చీలు పెట్టి గౌరవిద్దాం

-మంథని మాజీ ఉపసర్పంచ్, న్యాయవాది ఇనుముల సత్యనారాయణ

మంథని

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో ప్రజా ప్రతినిధులుగా, స్వాతంత్ర సమర యోధులుగా, నిజాం నవాబు పాలనపై పోరాటం చేసిన వీరులుగా తెలంగాణ ఉద్యమ కారులుగా ఉండి మంథని ప్రాంతానికి సేవ చేసి, మంథని కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అమరులైన వారిని పార్టీలకు అతీతంగా పలువురు మహనీయులకు విగ్రహాలు, వారి పేర్లపై పట్టణంలోని పలు వీధులకు, రోడ్లకు నామ పలక బోర్డులు ఏర్పాటు చేసి, వారిని నిత్యం స్మరించే విధంగా మంథని మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాలని కోరుతూ మంథని మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి,స్థానిక సంస్థలు అడిషనల్ కలెక్టర్,  మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ రెడ్డి మంథని మాజీ ఉపసర్పంచ్, న్యాయవాది ఇనుముల సత్యనారాయణ వినతిపత్రం అందించారు.

సందర్భంగా ఇనుముల సత్యనారాయణ మాట్లాడుతూ
ఈ మేరకు చారిత్రక నేపథ్యం కలిగిన మంథని పట్టణం ఎందరో మహనీయులను ప్రజలకు అందించిన చరిత్ర ఉందని కాగా గత పాలకులు,స్థానిక సంస్థల పాలకులు ఈ ప్రాంతానికి సంభందం లేనివారిని, మంథని పట్టణానికి సేవలు చేయని వారిని, ఏనాడు ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాని వారి విగ్రహాలు, పలు వీధులకు వారి పేర్లను పెట్టి ఇదే చరిత్ర అని మంథని ప్రజలపై రుద్ది అసలైన మంథని మహనీయుల చరిత్రను మరుగున పడేసిన పరిస్థితి ఇక్కడ నెలకొందని అన్నారు.
ప్రస్తుతం మంథని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా రాష్ట్ర ఐటిశాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు  ప్రత్యేక శ్రద్ధతో మంథని పట్టణ అభివృద్ధి కోసం,సుందరీకరణ కోసం  మంజూరు చేసిన కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివృద్ధి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ పరిధిలోని పలు రోడ్లకు, వీధులకు, పలు కూడళ్ళలో మంథనికి సేవ చేసి, పట్టణ చరిత్రను విశ్వ వ్యాప్తం చేసి అమరులైన మహనీయుల చరిత్రను గుర్తు చేసుకొనే విధంగా వారి విగ్రహాలు, వారి పేర్లపై మున్సిపల్ రికార్థులలో నమోదు చేసి, మున్సిపాలిటీ నిధుల ఖర్చుతో స్వాగత ఆర్చీలు, బోర్డులు ఏర్పాటు చేయాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నట్లు అయిన తెలిపారు.

అందుకు గాను మొదటగా మంథని ప్రాంతానికి అనేక ఏండ్లు ప్రాతినిధ్యం వహించి, ప్రజలు మరవని ప్రజానేతగా, అజాత శత్రువుగా పేరుగాంచిన స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు చరిత్రను భావితరాలకు తెలిసే విధంగానే కాకుండా మంథని నియోజకవర్గం ప్రధాన మండలాలకు, కాళేశ్వరం, మహారాష్ట్ర, ఛత్తిస్ ఘడ్ వంటి రాష్టాలకు వెళ్లే వారికి ప్రధాన రహదారిగా ఉన్న మంథని పాత పెట్రోల్ బంక్ కూడలిలో  ప్రజానేత చరిత్రను అందరూ తెలుసుకొనే విధంగా,ప్రస్తుతం నాలుగు లైన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్, డివైడర్లతో  కూడిన పనులు జరుగుతున్న అట్టి కూడలిని  అభివృద్ధి చేసి, సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేసి, అసెంబ్లీ ఎదురుగా ఉన్న జాతిపిత గాంధీ  విగ్రహం మాదిరిగా మహనీయుడు స్వర్గీయ శ్రీపాద రావు  పెద్ద విగ్రహాన్ని పాత పెట్రోల్ బంక్ కూడలిలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
మంథని మున్సిపల్ పరిధిలో ఉండి ఎమ్మెల్యేగా ఎన్నికయిన స్వర్గీయ గడిపెల్లి  రాములు , సిఎన్. రెడ్డి, ఎమ్మెల్సీ గా ఎన్నికైన స్వర్గీయ గీట్ల జనార్ధన్ రెడ్డి, స్వాతంత్ర సమర యోధులుగా ఉండి, నిజాం నిరంకుశత్వంపై  పోరాటం చేసిన మహనీయులు స్వర్గీయ గులుకోట శ్రీరాములు , పనకంటి కిషన్ రావు, సువర్ణ ప్రభాకర్, చొప్పకట్ల  చంటయ్య, రఘునాథ్ కాచే, మురళీధర్ కాచే, తమ్మనబట్ల దామోదర్ , రాంపెల్లి కిష్టయ్య,మోతేరామ్ గారి రాజేశ్వర్ రావు,సంజీవ్ రావు,ఎలిశెట్టి సీతారామ్, అవధానుల కిష్టయ్య , దేవళ్ళ రాజేశ్వర్ రావు, ఎం. గణపతి , సి. గణపతి రావు,గట్టు రామన్న, ఎస్. నరసింహులు, వెంకట రాజన్న,నరహరి  వంటి మహనీయులను గౌరవించుకోవాలన్నారు.
మంథని పట్టణంలో ప్రజా ప్రతినిధులు గా ఎన్నికయిన బయ్యగారి విఠల్, ముక్కా వీర రాఘవులు, కొమురవెల్లి మహాదేవ్, దొంతుల రాజలింగయ్య ,అంబేద్కర్ నగర్ కు చెందిన వేల్పుల రాజయ్య, విశ్వ బ్రాహ్మణ వీధికి చెందిన జంబోజు రాజయ్య, పట్టాణానికి చెందిన గొబ్బూరి సత్యం రాజ్ , మాదాసి రాములు , సిలివేరి రాజయ్య , కవి తాటికొండ రాజయ్య గౌడ్ , తాటి వెంకటి , వొడ్నాల సమ్మయ్య, బోయిని శంకరయ్య , నక్క బలరామ్,తెలంగాణ అమరుడు గుండా నాగరాజు ,మంథని మాజీ వార్డుసభ్యులు వినోద్ కుమార్ జావర్ (లడ్డు బాయ్ ), ఉప్పట్ల సత్యం,సామాజికవేత్తలు అశోక్ కుమార్ నాయుడు,బాపు గౌడ్  వంటి వారి చరిత్రలు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మంథని పట్టణ మహనీయుల చరిత్రను మనం మననం చేసుకొనే విధంగా, భావి తరాలకు అందించే విధంగా చర్యలు తీసుకొని అమరులైన వారిని నిత్యం స్మరించే విధంగా పలు వీధులకు, కొత్తగా నిర్మాణం అవుతున్న రోడ్లకు వారి పేర్లు పెట్టే విధంగా మున్సిపల్ రికార్దుల్లో నమోదు చేయాలని, అదేవిధంగా మున్సిపాలిటీ నిధులతో  అవసరం ఉన్న చోట, పరిస్థితి బట్టి మంథని మహనీయుల చరిత్ర పేరిట వారు పుట్టి,పెరిగిన చోట విగ్రహాలు, వీధుల్లో, రోడ్లకు మహనీయుల పేరిట  బోర్డులు, స్వాగత అర్చీలు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని మంథని మహనీయుల గౌరవం పేరిట మంథని మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించి పైన పేర్కొన్న పనులు చేపట్టాలని వినతిపత్రంలో అధికారులను కోరడం జరిగిందని ఆయన తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular