- Advertisement -
హైడ్రా పుణ్యంతో కాలనీ పార్కు విముక్తి
Liberation of Colony Park with the help of Hydra
అల్వాల్
హైడ్రా పుణ్యంతో మా కాలనీ పార్కు స్థలాన్ని కాపాడుకున్నామని సాయిబాబా నగర్ కాలనీవాసులు వెల్లడించారు. ఈ సందర్భంగా హైడ్రా అధికారి రంగనాథ్ కు, హైడ్రా బృందానికి, ఇందుకు కృషిచేసిన కాలనీవాసులు ఏసీపీ చంద్రశేఖర్, సంఘి శ్రీనివాస్ సుధాకర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధి సాయిబాబాగర్ కాలనీలో సర్వే నంబర్లు 592, 593 వద్ద స్కేటింగ్ పార్క్ సుమారుగా 1600 చదరపు గజాల విస్తీర్ణంతో ఉంది. కొంతమంది కాలనీ సభ్యుల మద్దతుతో భూమిని ఆక్రమించారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని.. వారి నుండి హైడ్రా అధికారులచే రికవరీ చేయబడింది. దీంతో పాటు కాంపౌండ్ వాల్ కోసం కాలనీ వాసులు కోరగా, జీహెచ్ఎంసీ అధికారులు రూ 10.5 లక్షల బడ్జెట్ మంజూరు చేయగా టెండర్లు మంజూరయ్యాయి. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. కాలనీ సహచరులు హైడ్రా బృందానికి మరియు ప్రత్యేకంగా రంగనాథ్ కు, హైడ్రా ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారుము
- Advertisement -