Sunday, September 8, 2024

ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు

- Advertisement -

ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు
న్యూఢిల్లీ ఫిబ్రవరి 19
ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్‌గా పనిచేసిన ఆయన లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ స్థానాన్ని భర్తీ చేశారు. జమ్ముకశ్మీర్‌ ఉధంపూర్‌లోని నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ నియమితులయ్యారు.కాగా, ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, దీనికి ముందు నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర వీరులకు నివాళులు అర్పించారు. అలాగే కొత్త బాధ్యతలు స్వీకరించే ముందు గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ అందుకున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ జనరల్ మనోజ్ పాండే ఈ ఏడాది మే 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆర్మీ చీఫ్‌గా ఆయన స్థానాన్ని భర్తీ చేయడంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ముందున్నట్లు తెలుస్తున్నది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్