Saturday, February 15, 2025

లిక్కర్ వ్యాపారం 1000 కోట్లపైనేనా

- Advertisement -

లిక్కర్ వ్యాపారం 1000 కోట్లపైనేనా

Liquor business is over 1000 crores

హైదరాబాద్, డిసెంబర్ 31, (వాయిస్ టుడే)
కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలంటే సంబరాలు అంబరాన్ని తాకాల్సిందే. తెలంగాణలో ఈసారి డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ సందర్భంగా భారీగా మద్యం అమ్మకాలు ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. డిసెంబర్ 31న ఒక్కరోజే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మద్యం సేల్స్ అయ్యే ఛాన్స్ ఉందని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి.మరో రెండు రోజుల్లో ఇయర్ ఎండ్ అవుతోంది. దీంతో సెలబ్రేషన్స్ కోసం అంతా రెడీ అయిపోతున్నారు. ఆరోజు ఎలా ఎంజాయ్ చేయాలి అనే దానిపై పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆరోజు చుక్క, ముక్క లేకుండా వేడుకలు జరగవు. మరీ ముఖ్యంగా మందుప్రియులు డిసెంబర్ 31న పీకల దాకా తాగి గడిచిన ఏడాది జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త ఏడాది కలిసి రావాలని కోరుకుంటూ వేడుకులు చేసుకుంటారు. దీంతో తెలంగాణలో డిసెంబర్ 31న మద్యం ఏరులై పారుతుంది.డిసెంబర్ 31న దాదాపు వెయ్యి కోట్ల లిక్కర్ సేల్ జరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. డిసెంబర్ 31న కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మద్యం స్టాక్ డిపోల నుంచి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2వేల 620 మద్యం దుకాణాలు ఉండగా.. 19 మద్యం డిపోల ద్వారా ప్రభుత్వం లిక్కర్ సరఫరా చేస్తోంది. మూడు రోజుల్లో దాదాపు 565 కోట్ల విలువైన మద్యం లిస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇవాళ మద్యం డిపోలకు సెలవు అయినప్పటికి.. డిసెంబర్ 31ను దృష్టిలో పెట్టుకుని లిక్కర్ స్టాక్ పంపిణీకి ఓపెన్ లో ఉంచారు. మొత్తంగా ఈ డిసెంబర్ 31న ఒక్కరోజే వెయ్యి కోట్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.మరోవైపు న్యూఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో మద్యం దుకాణాలు, కొనుగోళ్లపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31న మద్యం దుకాణాలను అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండొచ్చంది. ఇక బార్లు, రెస్టారెంట్లు అర్థరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచవచ్చని ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యూఇయర్ ను లిక్కర్ పార్టీతో వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు మద్యం ప్రియులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్