నివాస గృహాల మధ్య మద్యం షాపులు

- Advertisement -

నివాస గృహాల మధ్య మద్యం షాపులు

Liquor shops between residential houses

స్థానికుల ఆందోళన
చల్లపల్లి
నివాస గృహాల మధ్య షాపులు వెలుస్తూ ఉండడంతో ఆ ప్రాంతంలోని మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో నివాస గృహాల మధ్య మద్యం షాపులు ఏర్పాటు చేయరాదని, మద్యం షాపులు ఏర్పాటు చేస్తే మహిళలు పలు ఇబ్బందులకు గురి అవుతారని ఆందోళన చేయడంతో పాటు సంబంధిత శాఖ అధికారులకు వినతి పత్రం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా చల్లపల్లి బైపాస్ రోడ్డు లోని సాగర్ థియేటర్ మరియు కమ్యూనిస్టు కార్యాలయానికి అతి సమీపంలో నివాస గృహాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తున్నామని రేపటినుండి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందోనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివాస గృహాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేస్తుంటే అధికారులు ప్రజల ఇబ్బందులను పట్టించుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల ఇబ్బందులను గమనించి నివాస గృహాల మధ్య మద్యం షాపులను ఏర్పాటు చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలకు, మహిళలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్య తీసుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular