ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోవాలి: కలెక్టర్ పమేలా సత్పతి
Lives should be saved by obeying traffic rules: Collector Pamela Satpathy
కరీంనగర్
ఎస్ఆర్ ఆర్ కాలేజీ నుంచి సర్కస్ గ్రౌండ్ వరకు హెల్మెట్ ర్యాలీ
ముగిసిన రోడ్డు భద్రత మాసోత్సవం
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవం ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో జెండా ఊపి హెల్మెట్ ర్యాలీని రోడ్ సేఫ్టీ చైర్ పర్సన్, కలెక్టర్ ప్రారంభించారు.
అనంతరం గీతా భవన్ వద్ద ఉన్న సర్కస్ గ్రౌండ్ వరకు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు.
కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్కస్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు.
అతివేగంతో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల బారిన పడవద్దు అన్నారు. వాహనదారులు తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రతినెల అవగాహన కల్పించాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు.
ఇందుకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని పేర్కొన్నారు. అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ చాహత్ బాజ్ పేయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీటీసీ పురుషోత్తం, డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లా డీటీవో లక్ష్మణ్, ఎంవీఐలు రవికుమార్, వంశీధర్, ఏఎంవీఐలు హరిత యాదవ్, స్రవంతి, ఆర్టీసీ, ఎక్సైజ్ శాఖ, ట్రాన్స్ పోర్ట్ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, సిబ్బంది, పలువురు వాహనదారులు, ఎన్ సీ సీ కేడేట్లు పాల్గొన్నారు.