Saturday, February 7, 2026

ఎడారిగా మారనున్న ఎల్ఎండీ…

- Advertisement -

కరీంనగర్ జిల్లాకు నీటి సమస్య ముప్పు
ఎడారిగా మారనున్న ఎల్ఎండీ…
కరీంనగర్, మార్చి 17, (వాయిస్ టుడే)

LMD is about to become a desert...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీటి సమస్య ముప్పు ముంచుకొస్తుంది. జలాశయాల్లో శరవేగంగా నీటి మట్టాలు ఘననీయంగా పడిపోతున్నాయి. ఎండవేడి వడగాడ్పులతో పంట నహపొలాలు తడారి ఎండిపోతున్నాయి. సాగు నీరు అందించి ఎండుతున్న పంటలను కాపాడాలని రైతులతోపాటు రాజకీయ పార్టీలు ఆందోళన బాట పట్టాయి. దీంతో పంటలను కాపాడేందుకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా నీటి విడుదల చేస్తున్నారు. భారీగా నీటిని కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందిస్తుండడంతో జలాశయాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలని సర్కారు నిర్ణయించడంతో ప్రస్తుతం ఉన్న నీళ్ళు వారం పదిరోజుల్లో ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ నీటి నిలువ సామర్థ్యం 24 టిఎంసీలు కాగా ప్రస్తుతం 9 టిఎంసి నీళ్ళు మాత్రమే ఉన్నాయి. రోజుకు అర టిఎంసి 6 వేల క్యూసెక్కుల నీటిని కాకతీయ కెనాల్ ద్వారా రైతులకు సాగు నీరు అందిస్తున్నారు. ఎల్ఎండి కి ఎగువన ఉన్న మిడ్ మానేర్ నుంచి 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.ఎల్ఎండి నుంచి ఆరు వేల క్యూసెక్కుల నీటిని సాగు నీరుగా కాకతీయ కాలువకు విడుదల చేస్తుండగా 300 క్యూసెక్కుల నీళ్ళు మిషన్ భగీరథతోపాటు ఎండ వేడికి ఆవిరైపోతున్నాయి. ఇదే మాదిరిగా సాగునీరు ఇస్తే నాలుగు రోజులకు ఒక టిఎంసి చొప్పున ఈ నెలాఖరు వరకు 4 టిఎంసిల నీళ్ళు ఖాళీ అయి ఎల్ఎండి లో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరనుంది. కరీంనగర్ సిద్దిపేట జిల్లా ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ మొదటి వారంలోనే డెడ్ స్టోరేజ్ నుంచి త్రాగునీరు తీసుకునే పరిస్థితి ఉంటే… మే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తం అవుతుంది.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మిడ్ మానేర్ శ్రీ రాజరాజేశ్వర జలాశయం పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 27 టిఎంసిలు. ప్రస్తుతం 12.5 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. మిడ్ మానేర్ కు ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా 660 క్యూసెక్కుల నీరు వస్తుండగా మిడ్ మానేర్ నుంచి 2500 క్యూసెక్కుల నీటిని దిగువన ఎల్ఎండి కి మరో 650 క్యూసెక్కుల నీటిని రైట్ మేయిన్ కెనాల్ కు విడుదల చేస్తున్నారు. మరో 220 క్యూసెక్కుల నీళ్ళు ఆవిరైపోతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.ఇదే మాదిరిగా ఎండలు ముదిరి నీటిని విడుదల చేస్తే మార్చి మాసాంతం వరకు మిడ్ మానేర్ లో సైతం భారీగా నీళ్ళు తగ్గనున్నాయి. ఇప్పటికే మిడ్ మానేర్ పై ఆధారం పడ్డ వేములవాడ సిరిసిల్ల మానకొండూర్ నియోజకవర్గాల్లో సాగునీరు అందక వేలాది ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోయి రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.‌ఉమ్మడి జిల్లాకు జీవనాదారంగా ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో సైతం నీటిమట్టం గణనీయంగా తగ్గింది. 20 టిఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 10 టిఎంసిల నీళ్ళు ఉన్నాయి.‌ హైదరాబాద్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో త్రాగునీటి అవసరాలకు ఆ నీళ్లు సరిపోయే అవకాశం ఉంది. వాటిని పొదుపుగా వర్షాకాలం ప్రారంభం అయ్యేవరకు ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రస్తుతం ఎల్ఎండీ, మిడ్ మానేర్ లో ఘననీయంగా నీటిమట్టం పడిపోతుండడంతో ఎల్లంపల్లి నీటిని ఎత్తిపోసి సాగునీరు దేవుడెరుగు కనీసం త్రాగునీటి తిప్పల రాకుండా చూడాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు. ముంచుకొస్తున్న మంచినీటి ముప్పును గమనించి అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.‌ నీటి కష్టాలు రాకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయింది. మేడిగడ్డ బ్యారేజ్ కి పగుళ్లు రావటంతో… కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టింది మరమ్మత్తు పనులు ముందుకు సాగక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్, అన్నారం సరస్వతి బ్యారేజ్, సుందిళ్ళ వద్ద పార్వతి బ్యారేజీలు నీళ్లు నిలువ చేయకుండా మొత్తం ఖాళీ చేసి గోదావరిని ఏడారిగా మార్చారు. ఇప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్