రుణమాఫీ కానీ, రైతుల నుండి దరఖాస్తులు స్వీకరణ.
Loan waiver but applications from farmers are accepted.
సూర్యాపేట, ఆగస్ట్ 22(వాయిస్ టుడే ప్రతినిధి).
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న రుణమాఫీ పథకం , మూడు విడతలలో అకౌంట్లో జమ గాని రైతులు ఆందోళన చెందవద్దని ,రుణమాఫీ కానీ రైతులు పట్టేదారు పాస్ బుక్కు జిరాక్స్, బ్యాంక్ ఎకౌంటు, ఆధార్ కార్డు , అప్లికేషన్ తో సంబంధిత వ్యవసాయ అధికారులకు అందజేసి రుణమాఫీ పొందాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ,సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఉన్న రైతు వేదిక వద్ద, వ్యవసాయ అధికారులు ఎన్ పిచ్చయ్య , ఏ ఉప్పయ్య, ఎం మౌనిక, కె రేణుక రైతుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రుణమాఫీ కానీ రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఇంటింటా ప్రభుత్వ సర్వే చేపట్టనున్నట్లు, వ్యవసాయ అధికారులు తెలిపారు.