Sunday, September 8, 2024

దారి తప్పిన అందం

- Advertisement -

దారి తప్పిన అందం
విశాఖపట్నం
అందాల భామ చేతివాటం మత్తిక్కించే తన కళ్లతో.. వీడియోలతో సామాజిక మాద్యమాల్లో అనతికాలం లో మంచి పేరు తెచ్చుకుంది విశాఖకు చెందిన సోషల్ మీడియ ఇన్ ఫ్లూయెన్సర్, నటి సౌమ్య శెట్టి. ఈ అమ్మడికి కళలంటే ప్రాణం.. సోషల్ మీడియాలో రీల్స్ చేసి పాపులర్ అయిన ఈ చిన్నది… ఇప్పుడు కటకలాపాలై మళ్లీ పాపులర్ అయ్యింది. విశాఖలోని దొండ పర్తిలో  రిటైర్డ్  పోస్టల్ ఎంప్లాయ్ ఇంట్లో చోరీ చేసి సుమారు 100 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించిన నటి సౌమ్య శెట్టి.. ఆ డబ్బుతో గోవాలో ఎంచక్కా ఎంజాయి చేస్తూ దొరికిపోయింది.ఇన్ స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్న సౌమ్య… ఒకటి, రెండు చిన్నాచితకా చిత్రాల్లోనూ నటించింది. విశాఖకే చెందిన మరో సోషల్ మీడియ ఇన్ ఫ్లూయెన్సర్ మౌనికతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ తరుచూ వీడియోలు ఎలా చేయాలి. లైక్ లు రావాలంటే ఏం చేయాలని ఫోకస్ చేసేవారు. ఆ పరిచయం స్నేహంగా మారడంతో అప్పుడప్పుడు సౌమ్య మౌనిక ఇంటికి వస్తూపోతూ ఉండేది. ఈ క్రమంలో నేరుగా మౌనిక బెడ్ రూంకి వెళ్లేది. సౌమ్య గంటల తరబడి అక్కడే ఉండటంతో.. ఏంటని మౌనిక ప్రశ్నిస్తే… ఫోన్ మాట్లాడుతున్ననంటూ దాటవేసేది. అలా వెళ్లిన ప్రతిసారీ అమ్మడు చేతివాటం ప్రదర్శించేది. మౌనిక దాచుకున్న బంగారు నగలు గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేసింది. సుమారు వందగ్రాముల వరకు బంగారం చోరీ చేసింది. కొన్ని రోజుల తర్వాత బంగారం మాయమైనట్లు గుర్తించిన మౌనిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరిపైనా అనమానం లేదని.. సౌమ్య తరుచూ ఇంటికి వచ్చేదని తెలిపారు. దీంతో ఆమె కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు అసలు దొంగ తనేనని తేల్చారు.
మౌనిక ఇంట్లో కొట్టేసిన బంగారంతో సౌమ్య గోవా టూర్లకు వెళ్లి ఎంజాయ్ చేసింది. అకస్మాత్తుగా ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన పోలీసులు… గట్టిగా నిలిదేసే సరికి నిజం ఒప్పుకుంది. మొత్తం వంద తులాల బంగారం పోయిందని మౌనిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా…సౌమ్య 75 తులాలు తీసినట్లు పోలీసులు నిర్ధారించారు. అందులో 50 తులాల బంగారం రికవరీ చేయగా… మిగిలిన బంగారం అమ్మేసి ఖర్చు చేశానని చెప్పింది.సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 15 రోజుల రిమాండ్ కు తరలించారు.తస్కరించి అమ్మిన బంగారంతో సౌమ్య  ఐదులక్షలతో ప్యామిలీ మొత్తాన్ని గోవా ట్రిప్ నకు తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాగే ఒక లక్షన్నరతో కారు రీమోడలింగ్ చేయించుకున్నట్లు తేలింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్