- Advertisement -
పోయిన భార్య పోయింది… ఇక కేసు ఎందుకు
lost wife is gone... why the case?
హైదరాబాద్, డిసెంబర్ 13, (వాయిస్ టుడే)
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతురాలు రేవతి భర్త భాస్కర్ దీనిపై స్పందించారు. అవసరమైతే తాను పెట్టిన కేసును విత్ డ్రా చేసుకుంటానని ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనతో అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని.. బన్నీని విడుదల చేయాలని పోలీసులను కోరారు. అల్లు అర్జున్‌తో పాటు ఆ రోజు చాలామంది థియేటర్‌కు వచ్చారని అన్నారు. ‘నా కుమారుడు పుష్ప 2 సినిమా చూస్తానంటే సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లాను. ఇందులో అల్లు అర్జున్ తప్పేం లేదు. ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు నాకు సమాచారం ఇవ్వలేదు. ఆస్పత్రిలో ఉన్న నేను ఫోన్‌లో అరెస్ట్ వార్త చూశాను. కేసు విత్ డ్రాకు సిద్ధంగా ఉన్నా.’ అని స్పష్టం చేశారు.
- Advertisement -