Sunday, September 8, 2024

లూయిస్ బ్రెయిలీని ఆదర్శంగా తీసుకోవాలి

- Advertisement -
Louis Braille should be taken as an example

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల

లూయిస్ బ్రెయిలీని ఆదర్శంగా తీసుకోని ఆ దిశగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
గురువారం లూయిస్ బ్రెయిలీ 215 వ జన్మదిన వేడుకను ఐడీవోసీ  సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ షేక్ యాష్మిన్ బాషా పాల్గొని ఆమే మాట్లాడుతూ బ్రెయిలీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోని దివ్యాంగులు ఆ దిశగా లక్ష్యాన్ని ఎంచుకొని ముందడుగు వేయాలని అన్నారు. నిరాశ నిస్పృహలకు లోను కాకుండా దివ్యాంగులు సకలాంగుల మాదిరిగానే లక్ష్యాన్ని ఎంచుకొని  అకుంటిత దీక్షతో ఆ దిశవైపు పయనించాలని అన్నారు. దివ్యాంగులకు చట్టరిత్యా సంక్రమించవలసిన సౌకర్యాలన్నీ పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల యువతకు పలు రంగాలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్న దృష్ట్యా ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైకల్యాన్ని సామర్థ్యంగా మార్చుకొని ఉన్నత స్థానాలను పొందాలని సూచించారు. జిల్లాలో సదరం క్యాంపులు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటూ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. చట్ట ప్రకారం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ప్రతిభ ఆధారంగా లబ్దిపొందాలని ఆకాంక్షించారు. బ్రెయిలీ లిపి ద్వారా అంధులకు లబ్ది చేకూరిందని అన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి, బ్రెయిలీ విగ్రహ స్థాపనకు మున్సిపల్ అధికారులతో చర్చించి చర్యలు చేపడతామని సూచనప్రాయంగా తెలిపారు.ఆనంతరం
అదనపు కలెక్టర్ బి.ఎస్. లత మాట్లాడుతూ జనవరి 4 ను నాణ్యమైన దినంగా పాట రూపంలో వ్యక్తపరచడం అభినందనీయమని అన్నారు. ఆరు చుక్కలతో బ్రెయిలీ లిపిని రూపొందించడం అకుంటిత దీక్ష పరిజ్ఞానంతో తయారు చేయడం జగిగిందని అన్నారు. భవిష్యత్ తరాల వారికీ ఉపయోగపడే వాటిని రూపొందించడానికి నాంది పలకాలని అన్నారు. చిరు ప్రాయంలోనే మహోన్నత వ్యక్తిగా లూయిస్ బ్రెయిలీ ఎదిగాడని అన్నారు. ఆనాటి ఆయన కష్టంతోనే ఈనాటి బ్రెయిలీ లిపి ఆస్వాదిస్తున్నామని అన్నారు. క్రమ శిక్షణ, పట్టుదల, భవిష్యత్ తరాల వారికీ మార్గదర్శకులుగా నిలవాలని అన్నారు.ఆనంతరం
ఈ సందర్భంగా పలువురు అంధుల సంఘ నాయకులు మాట్లాడుతూ యావత్ ప్రపంచానికి బ్రెయిలీ మార్గదర్శకులు అయ్యారని, 1809 జనవరి 4 ఆయన జన్మదినాన్ని పుణ్య దినంగా అభివర్ణించారు.
అంతకుముందు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లూయిస్ జన్మదినాన్ని పురస్కరించుకొని కలెక్టర్ కేక్ కట్ చేశారు. కార్యక్రమం అనంతరం పలువురు అంధులను శాలువా, మెమెంటోలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, పలువురు సంఘ నాయకులు, అంధులు, పోషకులు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్