ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి
పోలీస్ కానిస్టేబుల్ భాగోతం
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి మౌన పోరాటం
Love with one.. Marriage with another
Police Constable Bhagotham
సూర్యాపేట
మూడేళ్లుగా.. తనను ప్రేమించనని తాను లేకుంటే జీవించలేనని మాయమాటలు చెప్పాడు. ప్రేమ ముగ్గులోకి దించి చివరకు కాదు పొమ్మన్నాడు.. మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. ఇది తెలిసిన ప్రేమించిన యువతి.. ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరానికి దిగింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని లక్ష్మాపురంలో చోటుచేసుకుంది. లక్ష్మాపురం
గ్రామానికి చెందిన మల్లెపాక నాగరాజు . హైదరాబాద్ అంబర్ పేట లో పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన సుంకరి తిరుమలను నువ్వు లేకుంటే బ్రతకలేని చెప్పి.. ప్రేమలోకి దించినట్లు బాధితురాలు అంటుంది. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని యువతి అనడంతో.. పెళ్లికి ఇప్పుడెందుకు తొందర.. నేను ఉద్యోగం ఇప్పిస్తా.. కొన్ని డబ్బులు ఖర్చయితాయని చెప్పి.. యువతి దగ్గరి నుంచి డబ్బులు సైతం తీసుకున్నాడట. తీరా నాగరాజు వేరొక యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలిసి.. ప్రియుడి ఇంటికి చేరుకోగా ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో.. గ్రామస్తుల సహకారంతో ఇంటి ఎదుట మౌన పోరాటం చేస్తోంది సదరు యువతి. తనకు న్యాయం చేయాలని బాధితురాలు అంటుంది.