ఎల్బీనగర్ లో ప్రేమోన్మాది కత్తితో దాడి..  తమ్ముడు మృతి

- Advertisement -
Lover attacked with knife in LB Nagar.. Brother died
Lover attacked with knife in LB Nagar.. Brother died

హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆర్టీసీ కాలనీలో అక్క, తమ్ముడిపై శివకుమార్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తమ్ముడు చింటూ చికిత్స పొందుతూ చనిపోయాడు. అక్క సంఘవి పరిస్థితి విషమంగా ఉంది. కామినేని ఆసుపత్రిలో సంఘవికి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడ్డ నిందితుడిని బంధించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. షాద్ నగర్ కి చెందిన సంఘవి, పృథ్వీ అలియాస్ చింటూ అక్క, తమ్ముళ్లు. ఎల్బీనగర్ లోని ఆర్టీసీ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సంఘవి హోమియోపతి ఫోర్త్ ఇయర్ చదువుతోంది. చింటూ బీటెక్ పూర్తి చేసి జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. రామంతాపూర్ కి చెందిన శివకుమార్.. సంఘవిని ప్రేమించాడు. ఆ విషయం మాట్లాడేందుకు శివకుమార్ సంఘవి ఇంటికి వెళ్లాడు. ఇదే సమయంలోనే శివకుమార్, సంఘవి, ఆమె తమ్ముడు చింటూ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో శివకుమార్ కత్తితో సంఘవి, చింటూపై దాడి చేశాడు. అరుపులు విన్న స్థానికులు నిందితుడు శివకుమార్ ని రూమ్ లో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

lover-attacked-with-knife-in-lb-nagar-brother-died
lover-attacked-with-knife-in-lb-nagar-brother-died
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular