రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా చేసారు
రాజోలు
రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం బీసీలను, అనకారిన వర్గాలను అణగదొక్కుతుంది. గతంలో చంద్రబాబు సొంత కాళ్లపై నిలబడే సంక్షేమ పథకాలను అమలు చేశారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో బీసీలను, అణగారిన వర్గాలను ఆడుకుంటుంది. 75 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులను బీసీ ద్రోహి జగన్ దారి మళ్ళించారని అయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ను 10 శాతం తగ్గించారు. 750 మంది బీసీలపై కేసులు పెట్టి హింసించారు. రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా తయారు చేశారు. గంజాయి కేసుల్లో ఎక్కువగా బడుగు బలహీన వర్గాల వారి పిల్లలే ఉంటున్నారు. అమలాపురంలో శెట్టిబలిజ సామాజిక వర్గీయులపై కేసులు పెట్టారు, వాటిని ఎత్తివేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏమి చేయలేదని అన్నారు.
రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా చేసారు
- Advertisement -
- Advertisement -



