మాధవరం కనకదుర్గ అమ్మవారి వద్ద భారీ అన్న సమారాధన

- Advertisement -

మాధవరం కనకదుర్గ అమ్మవారి వద్ద భారీ అన్న సమారాధన

Madhavaram Kanakadurga Ammavari huge Anna Samaradhana

తాడేపల్లిగూడెం ,అక్టోబర్ 5,
తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామంలోని గణపతి సెంటర్లో గల శ్రీ కనకదుర్గ ఆలయంలో దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు ఘనంగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మూడవరోజు శనివారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సుమారు మూడు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆలయంలో ఏర్పాటు చేసిన పీఠంలో 53 మంది భవాని దీక్ష చేపట్టారు. అన్నపూర్ణ పారాయణం, కుంకుమ పూజలు, భజనలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ హెడ్ సిద్దిరెడ్డి సత్యనారాయణ, గుడి కమిటీ ప్రెసిడెంట్ కుమ్మరి పురుగు ప్రకాష్ రావు, సెక్రెటరీ బండారు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 3 నుండి ప్రారంభమైన శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 12వ తేదీ వరకు జరుగుతాయి అన్నారు. ప్రతి ఏటా అమ్మవారిని అన్నపూర్ణ దేవి అలంకారం చేసిన రోజున భారీ అన్న సమరాధన నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. అందులో భాగంగానే శనివారం సుమారు మూడు వేల మందికి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగిందన్నారు. గ్రామస్తులు, భక్తులు సహాయ సహకారాలతో అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని వారు చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular