మున్నూరుకాపు సంఘము ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు
కాచిగూడ : జనవరి 8(వాయిస్ టుడే)
తెలంగాణ మున్నూరుకాపు కాచిగూడ విద్యార్థి వసతి గృహం ట్రస్ట్, మున్నూరుకాపుమహాసభ తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహిళ కమిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా సంక్రాతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గులపోటీకి అధిక సంఖ్యలో మున్నూరుకాపు మహిళలు పోటీలో పాల్గొనడానికి ఉత్సాహం చూపించారు.ఈ ముగ్గుల పోటీలో అమీర్ శెట్టి మానస ప్రధమబహుమతి, చలమల మమత రెండవబహుమతి , సంజన తృతీయబహుమతి గా ప్రకటించి బహుమతి మరియూ సర్టిఫికెట్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం లో విద్యార్థి వసతి గృహ ట్రస్ట్ చైర్మన్ మ్యాడం వెంకట్రావు మాట్లాడుతూ ఈ ముగ్గుల పోటీకి అత్యధికంగా మహిళలు పాల్గొన్నందుకు చాలా సంతోషకరంగా ఉన్నది ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు అందరము కలిసికట్టుగా జరుపకోవాలన్నారు.
మహాసభ అధ్యక్షులు మరియు ట్రస్ట్ మెంబెర్ పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కాచిగూడ మున్నూరుకాపు మహాసభ 1935 ఏర్పడింది. నేను 2014 నుండి మహాసభ అధ్యక్షులు గా కొనసాగుతున్నాను మరియు ట్రస్ట్ బోర్డు మెంబెర్ గా ఉన్నాను. ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని సంఘము బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ మరియూ మహాసభ అధ్యక్షులు ఈ సంక్రాతి ముగ్గుల పోటీ సందర్భంలో కాచిగూడ మహాసభ లో మొట్ట మొదటి అధ్యక్షురాలు చామకూర సుజాత, గౌరవ అధ్యక్షురాలుగా నందిగామ అన్నపూర్ణ , వైస్ ప్రెసిడెంట్ జగడం సృజన, రాష్ట్ర కార్యదర్శి మున్నూరు స్రవంతి గా ప్రకటించడం శుభదాయకం అని అన్నారు.
చామకూర సుజాత మాట్లాడుతూ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా నన్ను నియమించినందుకు ట్రస్ట్ చైర్మన్ మరియూ మహాసభ అధ్యక్షులకు ప్రతేక ధన్యవాదములు తెలుపుతూ మున్నూరుకాపు మహిళలకు ఎల్లవేళలా సేవా కార్యక్రమాలను చేపడుతూ ముందుకు తీసుకుపోతాను అని తెలిపారు.
మొదటిబహుమతి గ్రహీత అమీర్ శెట్టి మానస మాట్లాడుతూ ఈ సంక్రాతి ముగ్గులపోటీలో బహుమతి అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం లో మహాసభ కార్యవర్గ నాయకులు నగేష్, చేగురి వెంకటేశ్వర్ రావు పటేల్ , చెల్మెల ప్రదీప్, ఉగ్గే శ్రీనివాస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.



