- Advertisement -
వైభవంగా ద్రాక్షారామ భీమేశ్వరుడి కళ్యాణోత్సవాలు
Magnificent wedding celebrations of Draksharama Bhimeshwar
ఏలూరు
ప్రసిద్ధిగాంచిన పంచారామ క్షేత్రం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు అంగ రంగ వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి రుద్రాభిషేకం పంచామృత లతో అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా స్వామివారి నగరోత్స వం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలంకరించిన కళ్యాణమూర్తులకు సుముహూర్తంలో ఆలయ వేద పండితులు అర్చకులు సాంప్రదా య పద్ధతిలో శాస్త్రోక్తంగా కళ్యా ణం జరిపించారు. స్వామివారి కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ , ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం కుటుంబ సమేతంగా కళ్యాణోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన కళ్యాణ మండపం లో భీమేశ్వర స్వామి వారికి మాణిక్యమ్మ అమ్మవారికి వివాహం జరిపించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మహిళలు భక్తులు కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు.
- Advertisement -