మెట్ పల్లి అయ్యప్ప దేవాలయంలో మహా పడిపూజ…
Maha Padi Puja at Metpalli Ayyappa Temple...
అంబరాన్నంటిన మహా పడిపూజ వేడుకలు…
మెట్ పల్లి
మెట్ పల్లి పట్టణంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప పడిపూజ అత్యంత వైభవంగా నిర్వహించారు.. ఈ మహా పడిపూజ కార్యక్రమం గూడెం గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యుల వైదిక నిర్వహణలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.. ఈ మహా పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయ శాశ్వత గౌరవాధ్యక్షులు కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కమిటీ చైర్మన్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లు పాల్గొన్నారు. అయ్యప్ప మహా పడిపూజలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని అయ్యప్పస్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రానవేని సుజాత సత్యనారాయణ ,మార్క్ పెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి ,టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, అయ్యప్ప దీక్ష స్వాములు, భక్తులు మహిళలు ,చిన్నారులు ,తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు