- Advertisement -
ఘనంగా మహాత్మా స్వామి శ్రద్ధానంద్ జీ బలిదాన్ దినోత్సవం
Mahatma Swami Shradhanand Ji Balidan Day
హైదరాబాద్
మహాత్మా స్వామి శ్రద్ధానంద్ జీ బలిదాన్ దినోత్సవం శ్రద్ధా బాద్ ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో సైదాబాద్ హనుమాన్ దేవాలయం లో ఘనంగా నిర్వహించారు.ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సూర్య తేజా హాజరయ్యారు.మానవ జీవితం కేవలం ఆనందం కోసమే కాదని,స్వామీజీలా సమాజానికి ఏదైనా చేయాలని,ఆయన చూపిన బాటలో పయనించాలని అన్నారు.స్వామి శ్రద్ధానంద్ జీ వ్యక్తిత్వాన్ని తన ప్రసంగంలో ఎత్తిచూపారు మరియు స్వామి శ్రద్ధానంద్ జీ వేదాలు మరియు స్వామి దయానంద్ యొక్క బోధనలు మరియు సూత్రాల ఆధారంగా విద్యా సందేశాన్ని వ్యాప్తి చేశారని అన్నారు. అతను 1902లో గురుకుల్ కాంగ్రీని స్థాపించాడు. కార్యక్రమంలో స్థానిక కోర్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ స్థానికులను ఉద్దేశించి స్ఫూర్తి దాయకమైన విషయాలతో అందరి నీ ఆకట్టుకున్నారు,ఈ కార్యక్రమంలో విట్టల్ రావు, హరికిషన్ వేదాలంకార్, మైత్రేయి,కొత్త కాపు రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి, సుధీర్ రెడ్డి, కడారి రామ్ కుమార్,రమణ సింగ్,నవీన్, సుభాష్,మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.
- Advertisement -