- Advertisement -
ఫీజు పోరును విజయవంతం చేయండి..మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
Make the fee fight successful.. Former MLA Kangati Sridevi
కర్నూలు
వైఎస్సార్ సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 5వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టే ఫీజు పోరు నిరసన కార్యక్రమానికి విద్యార్థిని,విద్యార్థులు,తల్ లిదండ్రులు, వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు,విద్యార్థి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పిలుపు నిచ్చారు.శనివారం రోజున కర్నూల్ లోని స్వగృహంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి మరియు మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కలసి పోస్టర్ రిలీజ్ చేశారు.స్థానిక రాజ్ విహార్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ ని కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు. అనంతరం వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నాగేష్ మాట్లాడుతూ ఫీజుపోరు కార్యక్రమానికి ప్రతి ఒక్క విద్యార్థుని విద్యార్థులు పాల్గొని ఈ ధర్నా విజయవంతం చేయాలని ఆయన తెలియజేశారు.ఈ సమావేశంలో కొట్టాల వెంకట రాముడు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -